కరోనా మహమ్మారి ఏపీలో రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో 473 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక అందులో 14 మంది కొలుకోగా, 9 మంది మరణించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని జోన్ల వారీగా విడదీస్తుంది. ఇందులో రెడ్ జోన్ ఉంటే కరోనా తీవ్రత బాగా ఉందని, ఆరెంజ్ జోన్ అంటే కరోనా ప్రభావం ఉందని, ఇక గ్రీన్ జోన్ అంటే కరోనా తీవ్రత తక్కుగా ఉన్నట్లు.

 

ఇలా జోన్ల వారీగా విడగొట్టడం వల్ల కరోనా ప్రభావాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఆ మేరకు కృషి కూడా చేస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా, ఖాళీగా చూస్తూ ఉండలేని టీడీపీ దీనిపై కూడా రాజకీయం చేసే పని చేస్తోంది. వారు చేసే రాజకీయంలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే...ఈ జోన్లని మూడు రాజధానులతో లింక్ పెట్టారు. అందులో భాగంగానే కృష్ణా, గుంటూరు జిల్లాలని రెడ్ జోన్లలోకి తీసుకెళ్లారని, ఇక విశాఖని గ్రీన్ జోన్ లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

 

ఓ స్వామీజీ చెప్పారని ఏప్రిల్ 28కి విశాఖ వెళ్లేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని,  విశాఖను గ్రీన్ జోన్‌గా చూపించేందుకు అక్కడ సరిగా పరీక్షలు నిర్వహించటం లేదంటున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వాస్తవాలను తొక్కి పెడుతున్నారని విమర్శిస్తున్నారు. అసలు టీడీపీ నేతలు చేసే విమర్శలకు ఎలాంటి అర్ధం లేదు. కరోనా కేసులని దాయడం ఎవరి వల్ల కాదు. వాటిని దాస్తే ప్రభుత్వానికే ఎక్కువ నష్టం.

 

అసలు అలాంటి పని జగన్ ప్రభుత్వం చేయడం లేదు. కాకపోతే ఢిల్లీ మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చిన వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాలు వారు ఎక్కువ ఉన్నారు. అందుకే ఆ రెండు జిల్లాల్లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలా అనుకుంటే కర్నూలు జిల్లాలో తక్కువ కేసులు ఉండాలి. అక్కడ కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి టీడీపీ నేతలు చేసే విమర్శలకు ఎలాంటి అర్ధం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: