కరోనా మహమ్మారి భారత్ లోనూ బాగా విజృంభిస్తోంది. తొలి రోజుల్లో పదుల్లో బయటపడిన కేసులు ఇప్పుడు రోజూ వందల్లో బయటపడుతున్నాయి. కొవిడ్ బాధితుల సంఖ్య రోజురోజూ జోరుగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు కూడా చాలా సీరియస్ గా ఉండాల్సి ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాలు తమ శక్తి మేరకు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 

 

అయితే ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ లోని మమతా సర్కారు మాత్రం చాలా లైట్ గా తీసుకుంటోందట. అంతే కాకుండా అసలు మోడీ చెప్పే మాట వినేదేంటి అన్న కారణంగా కరోనా కట్టడి విషయంలో సీరియస్ గా లేదని నివేదికలు చెబుతున్నాయట. అంతే కాదు.. కరోనా పై ఆ రాష్ట్రం చెబుతున్న లెక్కలన్నీ అబద్దాలేనన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దేశంలో మిగిలిన చోట్ల ఉన్నంత సీరియస్ నెస్ అక్కడ లేదట.

 

 

ఈ విషయాన్ని ఐసీఎంఆర్ వంటి కేంద్ర సంస్థలు కూడా ధ్రువపరుస్తున్నాయట. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ వారం రోజుల్లో రెండు సార్లు హెచ్చరికలు పంపిందట. అయినా సరే మమత ధోరణిలో మార్పులేనట్టు తెలుస్తోంది. అసలే మోనార్క్ అయిన మమత బెనర్జీ.. ఇప్పటికీ కరోనాను లైట్ గా తీసుకుంటోందని లోకల్ బీజేపీ నాయకులు కూడా మోడీకి ఫిర్యాదు చేస్తున్నారట.

 

 

దీంతో దీదీని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాకుండా ఉందట మోడీ సర్కారుకు. పోనీ ఏదైనా గట్టి చర్య తీసుకుందామంటే.. ఈ ఏడాదే బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయన్నమాట. ఇప్పుడేదైనా చర్య తీసుకుంటే అది మమతా పై సానుభూతిగా మారే ప్రమాదం కూడా ఉంది. అయితే మోడీ అవన్నీ ఆలోచించడని.. అవసరమైతే ఆర్టికల్ 356 ప్రయోగించి మమత సర్కార్ ను రద్దు చేసే అవకాశం కూడా ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: