కరోనా సమయంలో ఇంట్లో పిల్లల అల్లరి అంతా ఇంతా కాదు.. సాధారణంగా స్కూలు పిల్లలకు ఒక్కరోజు సెలవు వస్తేనే వారిని భరించడమే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది ఏకంగా లాక్ డౌన్ కారణంగా రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అలాగని బయటకు ఆటలకు పంపిద్దామంటే తల్లిదండ్రులకు కరోనా భయం. ఇక ఇంట్లో వీళ్ల అల్లరి అంతా ఇంతా కాదు.

 

 

అందుకే లాక్ డౌన్ సమయంలో పిల్లలు స్మార్ట్ ఫోన్, టీవీలకు అతుక్కుపోతున్నారు. కానీ అది అంత మంచిది కాదు. ఈ అలవాట్లు కరోనా తర్వాత కూడా వారి భవిష్యత్తును పాడు చేస్తాయి. అందుకే ఇలాంటి వారి కోసం ఇప్పుడు జగన్ సర్కారు ఓ గుడ్ న్యూస్ చెబుతోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలను బోధించడానికి ఏర్పాటు చేసింది.

 

 

లాక్‌డౌన్‌ అనంతరం విద్యార్థులకు ముందుగా ప్రిపరేషన్‌కు సమయం ఇచ్చి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారట. కరోనా నేపథ్యంలోదూరదర్శన్‌, సప్తగిరి ఛానల్‌లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటలు వరకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ తరగతులు ఉంటాయి. విద్యారులు ఇళ్ల వద్దనే ఉండి చదువుకునే అవకాశం ఉంది.

 

 

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కరోనా లాక్ డౌన్ తర్వాత నిర్వహించే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. అలాగే ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నందువల్ల... విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి తమ ప్రిపరేషన్ విషయాలను పంచుకోవచ్చు. నోట్సులు ఇచ్చు పుచ్చుకోవచ్చు. ఈ కరోనా లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. ఆ తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. పదో తరగతి పిల్లలూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: