లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మధ్యతరగతి పేదవాళ్లు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రోజుకి ఆ రోజు బతుకు పైగా పనులు లేక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలావరకు స్వచ్ఛంద సంస్థలు మరియు కొంత మంది దాతలు పేద వాళ్ళు ఆదుకునే కార్యక్రమం ఇప్పటికే స్టార్ట్ చేశారు. అయితే హైదరాబాదులో లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా బిచ్చగాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనుషులు ఇంటి నుండి బయటకు రాగా డబ్బులు వేసే వాళ్ళు లేక ఆకలి తీర్చుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పోలీసులు వాళ్ళకి అండగా నిలుస్తున్నారు.

 

కరోనా వైరస్ ని కట్టడి చేస్తూనే… ప్రతీ రోజు 20 నుంచి 25 వేల మందికి అన్నం పెడుతున్నారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ముందు చూపుతో వాళ్ళ ఆకలి తీర్చే కార్యక్రమం మొదలుపెట్టారు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 31 ప్రాంతాల్లో పేదలు, వలస కార్మికులు, అనాథలు ఆకలి కేకలతో నరకం చూస్తున్నారని వాళ్లను గుర్తించి వాళ్ళకి అన్నం పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. పోలీసు శాఖతో పాటు అనేక కొన్ని స్వచ్ఛంద సంస్థలు హైదరాబాదులో బిచ్చగాళ్ళ కోసం వాళ్లకి ఆహారం కోసం తమ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా హైదరాబాద్ పోలీసులు పట్టణంలో అమలు చేస్తున్నారు.

 

ప్రారంభంలో మూడు వేల మందికి భోజన ఏర్పాట్లు జరుగగా ప్రస్తుతం పాతిక వేల మంది వరకు బిచ్చగాళ్ళు హైదరాబాద్ పోలీసుల వల్ల తమ కడుపును నింపుకుంటున్నారు. ఈ కార్యక్రమం కోసం  6 డీసీఎంలు, 14 బొలెరో వాహనాలను ఇందుకోసం వాడుతున్నారు. అందుకు 60 మంది వలంటీర్లు తమ వంతు సహకారం అందిస్తున్నారు. మార్చి-24 నుంచి ఏప్రిల్‌-12 వరకు మొత్తం 2.60 లక్షల మంది ఆకలి తీర్చారు పోలీసులు. దీంతో ఒకపక్క ప్రజల ప్రాణాలను కాపాడుతూ మరో పక్క రోడ్డు మీద ఉన్న బిచ్చగాళ్ళ ఆకలిని కూడా తీరుస్తున్న హైదరాబాద్ పోలీసులు పనితనానికి సోషల్ మీడియాలో నెటిజన్లు చేతులెత్తి మొక్కు తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: