తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో కే‌సి‌ఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ఆదాయానికి గండి పడినా గాని పరవాలేదని తెలంగాణలో ఏ ఒక్క ప్రాణం పోకూడదని అంటున్నారు. కే‌సి‌ఆర్ కరోనా వైరస్ విషయంలో అధికారులను పోలీసులను వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వైరస్ ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా వరకు కే‌సి‌ఆర్ తీసుకున్న నిర్ణయాలే అటు ప్రధాని మోడీ ఇదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫాలో అవుతున్నారు.

 

ఇదిలా ఉండగా ఉన్న వైరస్ ని ఇంకా పూర్తిగా పారద్రోలటానికి రాష్ట్రంలో ఉన్న ఉన్నత అధికారులకు అన్ని జిల్లాల పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రోజు నిత్యావసర సరుకులకు ఇప్పటి వరకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దాన్ని రెండు రోజులకు ఒకసారి మాత్రమే ప్రజలను బయటకు పంపడానికి కుదించాలని కే‌సి‌ఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా జరగబోయే లాక్ డౌన్ 19 రోజులు మాత్రం కఠిన ఆంక్షలను అమలు చెయ్యాలని ఆయన భావిస్తున్నారు.

 

రాష్ట్రం మొత్తం ఆరెంజ్ జోన్ గా ప్రకటించి ప్రజలను ఎవరిని కూడా బయటకు రాకుండా ఖాళీ గా ఉన్న ఆర్టీసి బస్సులను గ్రామాలకు తీసుకుని వెళ్ళాలి అని భావిస్తున్నారు. గ్రామాల విషయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో గనుక కేసులు నమోదు అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన గ్రామాల్లోకి ఏ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల విషయంలో ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు దొరికే విధంగా ప్రభుత్వమే ఇవ్వటానికి కే‌సి‌ఆర్ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: