భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజిబిస్తున్న  విషయం తెలిసిందే. ఈ ప్రపంచ మహామారికి   ఎలాంటి వాక్సిన్ కూడా లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలోనే కరోనా వైరస్ కు  కళ్లెం వేసేందుకు హైడ్రోక్లోరోక్విన్  ఎంతగానో ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. మలేరియా వ్యాధికి ఉపయోగించే ఈ మందు ప్రస్తుతం కరోనా వైరస్ కు కళ్లెం వేసేందుకు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. దీంతో ప్రపంచ దేశాల చూపు కూడ మహమ్మారి  వైరస్కు కట్టడి చేస్తున్నా మలేరియా వ్యాధి కి సంబంధించిన మందు పై పడింది. 

 

 దీంతో మలేరియా వ్యాధికి సంబంధించిన హైడ్రోక్లోరోక్విన్  ను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.  ప్రపంచ దేశాలు పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తమ దేశంలో కూడా కరోనా  వైరస్ కు సంబంధించి హైడ్రోక్లోరోక్విన్  మందులను సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఈ హైడ్రోక్లోరిక్విన్ మందు  బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే కనుగొనబడిన విషయం తెలిసిందే. బెరడు కషాయం లాంటివి మలేరియా వ్యాధికి వాడుతున్న సందర్భంలో... ఈ మలేరియా మందు కనుగొనబడింది.

 

 అయితే బ్రిటిష్ కాలంలో మలేరియాకు ముందు కనుగొనబడినప్పటికీ అప్పుడు ఈ మందు కనుగొన్నది మాత్రం భారతీయుడు అని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా ను కట్టడి  చేసేందుకు ఉపయోగపడుతున్న హైడ్రోక్లోరోక్విన్  మందు ... అప్పట్లో భారతీయుడు సృష్టి అని తెలుస్తోంది. కషాయం లాంటి మందు  మలేరియా వ్యాధికి తీసుకున్న తరుణంలో వాటికి ఒక టాబ్లెట్ రూపాన్ని ఇచ్చి సరికొత్తగా తయారుచేశాడు భారతీయుడు. ఈ మాత్రమే తయారు చేసిన భారతీయుడు ప్రఫుల్ల చంద్ర్రె . 1861ఆగస్టు 2న అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించిన ఈయన ఇంగ్లాండ్ ఎడింబరో యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారు. రసాయన శాస్త్రం ఎంతో మెలకువలు నేర్చుకున్నాను మలేరియా కు సంబంధించిన మందులు కనుగొన్నారు. దేశం విపత్తుల సమయంలో ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: