కరోనా వైరస్.. ఎంత డేంజర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అలాంటిది. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న ఈ కరోనా వైరస్ ఇప్పటికే 19 లక్షలమందికిపైగా వ్యాపించింది. ఇంకా అందులో లక్ష 25 వేలమంది మరణించారు.. అంతలా వణికిస్తున్న ఈ కరోనా వైరస్ భారత్ లో కూడా ఎక్కువ అవుతుంది. 

 

ఇప్పటికే గత 23 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది.. మరో 20 రోజులు లాక్ డౌన్ పొడిగించారు. మే 3వ తేదీ వరుకు లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే ఇంకా ఇలా కొనసాగుతుండగా ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వార్త తెలిస్తే ప్రతి ఒక్కరు హడలిపోతారు.. అలాంటి షాకింగ్ వార్త అది. 

 

ఏంటి అంటే? కరోనా లక్షణాలు ఉన్న ఓ ఎమ్మెల్యే ఇంట్లో ఉండకుండా అందరిని కలిశాడు.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను కలిశాడు. వారిని కలిసిన అనంతరం అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది.. దీంతో హడలిపోయిన ఆ ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రిలో చేరాడు.. ఇది అంతే చూసి తెలుగు రాష్ట్రాల్లో జరిగింది అనుకునేరు.. 

 

ఇది జరిగింది 'గుజరాత్'లో. అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా, గ్యాసుద్దీన్, శైలేష్ పర్మార్ అనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రుపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, హోంమంత్రి ప్రదీప్ సిన్హా జడేజాలను కలిశారు. కరోనా నియంత్రణపై ఏలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ముఖ్యమంత్రి రూపానీ వారితో చర్చలు జరిపారు. 

 

అయితే ఇక్కడ విమర్శలకు దారితీసిన అంశం ఏంటి అంటే? అప్పటికే కరోనా పరీక్షలకు రక్త నమూనాలు ఇచ్చిన ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి సమావేశానికి ఆహ్వానించడం ఏంటి? అతన్ని ఎలా అనుమతించారు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. అంతేకాదు ఈ కరోనా లక్షణాలు ఉన్న ఎమ్మెల్యే ఇప్పటికే ఎంతోమందిని కలిశారు అని.. ఎంతో మంది అధికారులతో చర్చలు జరిపారని సమాచారం. మరి గుజరాత్ లో పరిస్థితీ ఎం అవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: