అమెరికాపై కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి చేయి దాటేలా ఉందని కొందరు అంటుంటే..మరి కొందరు మాత్రం త్వరలోనే అమెరికా కరోనా బారి నుంచీ బయట పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలాఉంటే ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య సుమారు 25 వేలకి చేరుకోగా..బాధితుల సంఖ్య 6 లక్షలు దాటింది. ఈ వ్యాధి నుంచీ బయటపడుతున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉన్నా తాజాగా అధికారులని ఓ వార్త ఆందోళనలకి గురిచేస్తోంది..

IHG

కరోనా వైరస్ ని అమెరికాలో కంట్రోల్ చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ 30 రోజుల ప్రణాళికను సిద్దం చేశారు. 30 రోజుల్లో కరోనా వ్యాప్తి తగ్గితే తిరిగి అమెరికాలో మునుపటి రోజులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సమయంలో గతంలో కరోనా నుంచీ కోలుకున్న వారికి మళ్ళీ కరోనా పాజిటివ్ లు రావడంతో అధికారులు ఆందోళనకి లోనవుతున్నారు.. చైనా లో కూడా కరోనా రోగులు కోలుకుని ఇళ్ళకి వెళ్ళిన తరువాత వారిలో ఎంతో మందికి మళ్ళీ పాజిటివ్ రావడం  గమనించిన వైద్యులు వెంటనే స్పందించి వారిని మళ్ళీ క్వారంటైన్ కి తరలించారు..

IHG

అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు అందులో చాలామంది కోలుకున్నారు..మళ్ళీ వీళ్ళందరికి కరోనా వస్తే ఊహించడానికే ఎంతో దారుణంగా ఉంటుందని అంటున్నారు. మళ్ళీ అమెరికా సాధారణ స్థితికి రావాలంటే ప్రస్తుతం కోలుకున్న వారే అత్యంత కీలకమని అంటున్నారు నిపుణులు. అయితే కోలుకున్న వారికి రోగనిరోధక శక్తి ఉందని, అలాంటి వారిని ముందుగానే హెచ్చరిస్తూ వారికి రోగనిరోధక శక్తి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు వైద్యులు. ఒక వేళ ఊహించినట్టుగా జరిగితే పరిస్థితులు చేయి దాటిపోతాయని అమెరికా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు ఉండవని అంటున్నారు నిపుణులు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: