క‌రోనా వైర‌స్‌తో ప్రపంచవ్యాప్తంగా క‌ల‌క‌లానికి కార‌ణంగా మారిన చైనాకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్ర‌జ‌లంద‌రినీ ప‌రేషాన్ చేస్తున్న చైనాకు అదే రీతిలో దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ రూపంలో అగ్ర‌రాజ్యం అమెరికా చైనాకు షాకిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి తోడ్పడిందని, చైనాకు అనుకూలంగా మారిందని ఆరోపణలు చేసిన‌ అమెరికా తాజాగా ఈ రూపంలో టార్గెట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన దూకుడు  ప్రదర్శించారు.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుంచి అత్యధికంగా నిధులు అందుతున్నాయి. వూహాన్‌లో కరోనా పుట్టి వ్యాపించినప్పుడు దాన్ని కప్పి పుచ్చే ప్రయత్నాల్లో చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వంతపాడిందన్నది ట్రంప్‌ ప్రధాన ఆరోపణ. అలాగే, చైనా నుంచి రాకపోకలపై పాక్షిక నిషేధాన్ని అమెరికా విధించగా, దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యతిరేకించింది. కరోనా వైరస్‌ మనుషుల ద్వారా వ్యాపించదని చైనా చేస్తున్న వాదనను వినిపిస్తూ, తాము చైనీయుల రాకపోకలపై విధించిన పాక్షిక నిషేధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుపట్టడాన్ని ట్రంప్‌ సహించలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, దానికి అమెరికా నుంచి నిధులను నిలిపి వేస్తామని గత వారంలోనే అధ్య‌క్షుడు ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొద్దిరోజుల్లేనే దాన్ని ఆయన నిజం చేసేశారు. తమ దేశ నిధులతో నడుస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ దేశానికే వ్యతిరేకంగా గళం విప్పడమేమిటని షాకిచ్చారు. 

 


కాగా, ట్రంప్ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో విఫలమైన అమెరికా అధ్యక్షుడు దాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థపై విరుచుకుపడుతున్నారు. అది చైనాకు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. దీనిపై మండిపడిన ట్రంప్‌ ఇప్పుడు ఏకంగా ఆ సంస్థకు అమెరికా అందిస్తున్న అన్ని నిధులను నిలిపివేసింది. అమెరికా ఏటా 400 నుంచి 500 మిలియన్‌ డాలర్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందిస్తుండగా, చైనా కేవలం అందులో పదో వంతు మాత్రమే ఇస్తోందని ఆయన పేర్కొంటూ, తమ నిధులను ఉపయోగించుకుని తమపైనే విమర్శలకు దిగడం దారుణమన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: