తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల నిర్వహించిన ఊక మీడియా సమావేశంలో ప్రస్తుతం కరోనా సమస్యతో చిన్నాభిన్నం అయిపోయిన ఆర్ధిక వ్యవస్థను గాడిలోకి తీసుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలి అంటే ‘హెలికాఫ్టర్ మనీ’ ఒకటే మార్గమని అభిప్రాయపడుతూ ఈ విషయమై bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలి అంటూ అభిప్రాయపడ్డారు. దీనితో ఈ హెలికాఫ్టర్ మనీ గురించి అందరు మాట్లాడుకోవడం మొదలు పెట్టడమే కాకుండా ఈ పద్దతితో దేశం గట్టెక్కుతుంది అని ఆశలు పెట్టుకున్నారు.


దేశం ఆర్ధిక సమస్యలలో పూర్తిగా కూరుకు పోయినప్పుడు సంక్షేమ పదకాలు అమలు చేయడానికి కూడ ప్రభుత్వం వద్ద డబ్బు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిన విధంగా వేల కొట్లలో ఆర్ధిక సహాయం చేయడానికి అదనంగా కరెన్సీ నోట్ల ముద్రణ చేసి ప్రభుత్వాలకు సహాయంగా చేసే పద్ధతిని హెలికాఫ్టర్ మనీ అని అంటారు. ఈపద్ధతిని ‘క్వాంటిటేటివ్ ఈజింగ్’ అని ఆర్ధిక నిపుణులు పిలుస్తారు. 


అమెరికాలోని ఫెడరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ బెన్ బెర్నెంకే ఈ పద్ధతిని గతంలో ప్రతిభాధించారు. ప్రభుత్వాలు తమ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రభుత్వాల వద్ద ఉన్న పెద్ద ఎత్తున ఆస్థులు బాండ్లు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ వాటికి సమానంగా సంక్షేమ పదకాల కోసం కరెన్సీ నోట్లను వందల కోట్ల స్థాయిలో అదనంగా ముద్రిస్తూ ప్రభుత్వాలను ఆదుకునే పద్ధతి ఇది. ప్రస్తుతం దేశం గాడిలో పడాలి అంటే సుమారు 20 లక్షల నుండి 24 లక్షల కోట్ల ప్యాకేజ్ కావాలి అని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్న పరిస్థితులలో ఈ హెలికాఫ్టర్ మనీ ఒక్కటే పరిష్కారం చాలామంది భావిస్తున్నారు. 


అయితే ఇలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ సలహాతో రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటే ఈ నిర్ణయం వల్ల దేశానికి కరోనా కష్టాలు కన్నా మరిన్ని ఆర్ధిక కష్టాలు వస్తాయని అధిక ద్రవ్యోల్బణం తో దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత అతలాకుతలం అవుతుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో జింబాబ్వే దేశంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఇలాంటి పద్ధతులు అనుసరించడం వల్ల ఆ దేశ కరెన్సీ విలువ తీవ్ర పతనానికి గురై ఆదేశం దివాళా దశకు చేరుకుందని అన్న విషయాలను ఆర్. గాంధీ గుర్తుకు చేస్తున్నారు. అందువల్ల ఇష్టానుసారంగా కరెన్సీ నోట్లు ముద్రించడం కుదరదనీ అలాంటి పరిస్థితులు ఎదురైతే 100 రూపాయల నోటు చిత్తుకాగితం తో సమానంగా మారిపోయే పరిస్థితులు వస్తాయని ప్రస్తుతం కరోనా తో దేశం ఎదుర్కుంటున్న ఆర్ధిక సమస్యల గురించి లోతైన ఆలోచనలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే పెను ముప్పు మన దేశాన్ని అతలాకుతలం చేస్తుంది అంటూ ఆర్. గాంధీ చెప్పిన అభిప్రాయాలు ఈనాటి మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: