మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఉదయం 8.30 గంటలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారని ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఆదివారం రోజు మధ్యాహ్నం పీఎంవో కార్యాలయానికి ఫోన్ చేసి మోదీతో మాట్లాడాలని తాను కోరారని మోదీ నిన్న ఉదయం కాల్ చేయగా కొన్ని సూచనలు చేశానని చంద్రబాబు అన్నారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం తాను ప్రధానికి కరోనా నియంత్రణ చర్యల గురించి లేఖ రాశానని చెప్పుకొచ్చారు. 
 
ప్రధాని మోదీ చంద్రబాబుకు కాల్ చేయడం వల్ల మోదీకి, బాబుకు మధ్య ఉన్న గ్యాప్ మాత్రం కొంత తగ్గిందని చెప్పవచ్చు. 2019 ఎన్నికలకు అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న చంద్రబాబు... ఎన్నికలకు ముందు మాత్రం మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం చంద్రబాబు కాంగ్రెస్ మద్దతు పలకటం... మోదీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల మోదీ, చంద్రబాబు మధ్య గ్యాప్ భారీగా పెరిగింది. 
 
ఆ తరువాత చంద్రబాబు మోదీకి దగ్గరవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం కనపడలేదు. అయితే తాజాగా పలు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలతో, సీనియర్ నాయకులతో ప్రధాని మోదీ కరోనా కట్టడి కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఉండటం... చంద్రబాబు అదే సమయంలో మోదీతో మాట్లాడాలని కోరడం... మోదీ కాల్ చేయడం చకచకా జరిగిపోయాయి. 
 
చంద్రబాబు మోదీ తనకు కాల్ చేశాడని చెప్పడం ద్వారా మోదీ, చంద్రబాబు మధ్య కొంత గ్యాప్ తగ్గిందనే చెప్పాలి. అయితే మోదీ, చంద్రబాబు మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గినట్లేనా...? లేదా...? తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగక తప్పదు. చంద్రబాబు బీజేపీతో సన్నిహితంగా మెలగాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 
       

మరింత సమాచారం తెలుసుకోండి: