భారతదేశాన్ని అనూహ్య రీతిలో కబళించి వేస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు సుప్రీంకోర్టు కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వచ్చింది. విషయం ఏమిటంటే... ముందుగా సుప్రీంకోర్టు కరోనా భారత దేశంలో తీవ్ర స్థాయిలో విజృంభించడం మొదలుపెట్టిన కొత్తల్లో 130 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా కరోనా టెస్టులను నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనితో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైన అఫిడవిట్ లు జారీ చేసుకున్న తర్వాత... సుప్రీం కోర్టు దీనిపై మళ్ళీ పునరాలోచన చేసింది.

 

తర్వాత సుప్రీంకోర్టు అన్నీ పిటిషన్లను పరిశీలించిన మీదట... దేశంలోని పేదవారు అందరికీ ఉచితంగా కరోనా  పరీక్షలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. అయితే ఇప్పటివరకూ దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క కరోనా నిర్థారణ పరీక్షా ఉచితంగానే జరుగుతుండడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశించినా.. ఇవ్వకపోయినా అన్నీ ప్రభుత్వాలు నయాపైసా డబ్బులు తీసుకోకుండా అటు పరీక్షలు.. ఇటు వైద్యం కూడా ఉచితంగానే చేస్తూ ఉన్నారు ఇకపోతే ఎవరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాలకి ఒక క్లారిటీ ఉంది.

 

ఎవరికైతే ముందు కరోనా పాజిటివ్ అని తేలిందో.. వారి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు మరియు వారిని కాంటాక్ట్ అయిన వారికి కరోనా టెస్టులు నిర్వహిస్తారు. అంతేగాని దేశంలోని ప్రజలందరికీ మరియు పేదలందరికీ ఊరికి ముందు కరోనా టెస్టులు నిర్వహించాలి అంటే... అది చాలా కష్టమైన విషయమని భారత మెడికల్ అసోసియేషన్ మరియు ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన అన్ని ప్రైవేటు ల్యాబ్ లు సుప్రీం కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు. కరోనా టెస్టు అంటే చాలా సాధారణ విషయం కాదని వారికి చివరికి అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: