ప్రపంచాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో కకావిలం చేస్తున్న కరోనా వైరస్ ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్న మొత్తం చుట్టేస్తుంది.  అయితే ఈ కరోనా కొన్ని జంతువులు, పక్షుల మాంసం తినడం వల్ల వస్తుందని అంటున్నారు.  రోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం గబ్బిలాలే.  గబ్బిలాలను చైనీయులు తినడం వలన వాటి నుంచి మనుషులకు సంక్రమించింది.  అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది.  అయితే, గబ్బిలాలు అన్నది ప్రతి దేశంలో ఉంటాయి. ఒక్కో దేశంలో ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి వ్యాధి నిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది.

 

 ఇప్పుడు మన దేశ పరిశోదకులు సైతం వీటిపై ప్రయోగం చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఈ పరిశోదనలో కొన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరిలో నివసించే ఫ్లైయింగ్ ఫాక్స్, రౌసెటస్ వంటి గబ్బిలాలపై ఐసిఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి సంస్థలు పరిశోధనలు చేసాయి.  ఈ రెండు జాతి గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు.  మిగతా జాతులకు సంబంధించిన గబ్బిలాల్లో వైరస్ లేకపోవడం విశేషం.

 

చైనాలో ఎక్కువ శాతం గబ్బిలాల మాసం.. సూప్ లాంటివి తాగడం వల్ల కొన్ని చిత్ర విచిత్రమైన రోగాలు వస్తున్నాయని అక్కడ వారు అంటున్నారు. అయితే  రెండు జాతులే కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయని ఆ శాస్త్రవేత్తల రిపోర్ట్ లో బయటపడింది.  ఈ గబ్బిలాల నుంచి వైరస్ మనిషికి సంక్రమించే అవకాశం ఉన్నదా లేదా అనే విషయంపై ప్రస్తుతం లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ గబ్బిలాల నుంచి డైరెక్ట్ గా మనిషికి సంక్రమించకుంటే చైనాలో గబ్బిలాల నుంచి మనుషులకు ఎలా వైరస్ సంక్రమించి ఉంటుంది అన్నది మిస్టరీగా మారొచ్చు అని పరిశోదకులు అంటున్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: