పూర్వం పెద్దలు చెబుతుండేవారు.. భూమి మీద పాపాలు పెరిగిపోయినప్పుడు గాని.. లేదా ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక రూపం మహా ప్రళయం వచ్చి భారీ జన ప్రాణ నష్టాన్ని కలిగించి ఉరుకుల పరుగుల ప్రపంచాన్ని  మొదటికి తెస్తుంది అని చెబుతుంటారు. గత వందేళ్ల క్రితం ఓ మహమ్మారి వచ్చి  ఎంతో ప్రాణ నష్టం కలిగించి జన జీవనాన్ని మళ్లీ మొదటికి తీసుకొస్తే... మళ్లీ వందేళ్ల తర్వాత ప్రస్తుతం కరోనా  వైరస్ రూపంలో ప్రపంచ ప్రళయం  ముంచుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పోయిన కరోనా వైరస్ బారిన పడింది ఎంతో ప్రాణ నష్టం కలగడమే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా దిగజారుతోంది . కరోనా వైరస్ కారణంగా ఎంత దుస్థితి వచ్చింది అంటే .. హాస్పిటల్ సరిపోక నడిరోడ్డు పైన బెడ్ పెట్టి  చికిత్స అందించాల్సిన దుస్థితి వచ్చింది. అది కూడా ఎంతగానో అభివృద్ధి చెందిన దేశాల్లో . 


 ఇక చిన్న చిన్న దేశాల పరిస్థితి రోజు రోజుకూ అధ్వానంగా మారిపోతున్నాయి. ఈ కరోనా  వైరస్ కారణంగా ప్రాణాలు పోవడమే కాదు దేశ ఆర్థిక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. సంపన్నుల సంపద వేల కోట్లు నిమిషాల్లో ఆవిరైపోతుంది. ప్రతి రంగం పైన ఈ మహమ్మారి ప్రభావం పడింది. ఈ మహామ్మారిని  ఎఫెక్ట్ కారణంగా  ప్రపంచవ్యాప్తంగా ఆయ దేశాల్లో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా ఎన్నో కంపెనీలు దివాలా తీశాయి. మొన్నటి వరకు ఉరుకులు పరుగుల జీవితంలో డబ్బు సంపాదన పై ఎక్కువ దృష్టి పెట్టిన ప్రజానీకం ఇప్పుడు బతికి బట్ట కడితే చాలు సంపాదన తర్వాత అనుకుంటున్నారు. 

 


 అయితే ప్రస్తుతం ఈ మహమ్మారి ప్రభావం మీడియో రంగంపై కూడా భారీగానే పడింది. ఎన్నో మీడియా సంస్థలు మూత పడుతున్నాయి ఎంతో మంది  తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. మరికొన్ని కంపెనీలు  జీతాలలో కోత విధిస్తున్నారు. ఇక మీడియా రంగంలో తెలుగులో అగ్రశ్రేణి దినపత్రికలో  135 మంది ఉద్యోగులను తొలగించే..  వారికి 25% జీతాలు ఇస్తామని తెలిపింది.. ఇక మిగతా పని వారి సాలరీలలో  25 శాతం కోత పెట్టి ఇంటి దగ్గర ఉండే వాళ్లకి జీతాలు చెల్లించేందుకు నిర్ణయించారు . అటు  ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా భారీగా కోతలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కరోనా  వైరస్ కారణంగా భారీ సంక్షోభం ఏర్పడింది.కరోనా తో  అసలు మీడియా రంగంలో ఎలాంటి సంక్షోభం ఏర్పడింది... ఏ సంస్థల్లో  ఎలాంటి నిర్ణయాలు  తీసుకున్నది అన్నది ఈ కింది వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: