క‌రోనా వైర‌స్‌ను చైనా ప్ర‌పంచం మీద‌కు కుట్ర‌పూరితంగానే వ‌దిలింద‌ని ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున్న వినివిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చాలా దేశాలు ఆదేశాన్ని అనుమాన‌పు చూపుతో చూస్తునే ఉన్నాయి. ఇక అమెరికా అయితే ఏకంగా ఇప్ప‌టి నుంచే ఎదురుదాడికి దిగుతుండ‌టం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం వైట్‌హౌస్‌లో జ‌రిగిన విలేఖ‌రుల స‌మావేశంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చైనాపై విరుచుకుప‌డ్డారు. తాము చైనాను వ‌దిలబోమని స్ప‌ష్టం చేశారు. చైనాను ఏం చేయ‌బోతున్నార‌ని ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు మేం చేయ‌బోతున్నామో చైనాకు తెలిస్తే స‌రిపోతుందంటూ మీకు చెప్పాల్సిన ప‌నిలేదు అంటూ ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. 

 

IHG

 

ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్‌ను చైనానే త‌యారు చేసింద‌నే వాద‌న‌లు మొద‌టి నుంచి వినిపిస్తున్నాయి. ఈ వైర‌స్ చైనాలో క‌ట్ట‌డి కావ‌డం..మిగ‌తా దేశాల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతుండ‌టం కూడా ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. చైనా కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నా..పెద్ద‌గా ఖండించింది లేదు. త‌న నిజాయితీని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసింది కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్రకారం..చైనాను అంత‌ర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు అనేక దేశాలు ఏక‌తాటిపైకి వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముందు చైనా ఆర్థిక‌, వ్యాపార వ్య‌వ‌హ‌రాల‌పై దెబ్బ‌కొట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.


ఇక ఇప్ప‌టికే చైనాలోని జ‌పాన్ వ్యాపారులు చాలా వ‌ర‌కు త‌మ పెట్టుబడుల‌ను వెన‌క్కి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌పంచంలోనే దిగ్గ‌జ సంస్థ‌లైన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఆపిల్ కార్యాల‌యాల‌ను క్ర‌మంగా ఎత్తివేసేందుకు చ‌ర్య‌లు ఆరంభ‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో ఆ సంస్థ‌ల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయిన‌ప్ప‌టికి ఇది త్వ‌ర‌లోనే జ‌రిగి తీరుతుంద‌ని, ఆయా దేశాల నుంచి ఆ సంస్థ‌ల అధినేత‌ల‌కు స‌మాచారం వెళ్లింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న చైనా ఇప్ప‌టికే కార్యాల‌యాలు త‌ర‌లివెళ్ల‌కుండా ఆపేందుకు విఫ‌ల‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. చైనాను వ్య‌తిరేకించే దేశాల సంఖ్య మిక్కిలిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక ఎప్ప‌టి నుంచే స‌ముద్ర మార్గాల విష‌యంలో వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చైనా తీరును జ‌పాన్‌, భార‌త్‌లో ఇప్పుడు అంత‌ర్జాతీయ స‌మాజానికి గుర్తు చేస్తుండ‌టం ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: