భారత్ చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా పాకిస్థాన్ కు బుద్ది రాదనేది తెలిసిన విషయమే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను దశాబ్దాలుగా తమ గుప్పిట్లో పెట్టుకున్న పాక్ కు ఇంకా ఆశ చావలేనట్టుంది. మోదీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేసిన తర్వాత పాక్ కు ఊపిరి ఆడటం లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఇప్పుడు మరో కొత్త రాజకీయానికి తెర తీసింది. ప్రపంచానికి పీవోకేను కాశ్మీర్ అనే దేశంగా చూపిస్తూ ఆ ప్రాంతాన్ని భారత్ ఆక్రమించుకోవాలని చూస్తోందంటూ నిన్న రాత్రి ఓ ప్రకటన చేసింది.

 

 

ఈ ప్రకటన కూడా వాళ్లు చెప్తున్న కశ్మీర్ దేశానికి ప్రధాని అయిన రాజా ఫరూక్ హైదర్ ఈ ప్రకటన చేసినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ కశ్మీర్ అనే దేశాన్ని తాము పరిపాలించడం లేదని చెప్పడం.. అక్కడి కశ్మీరీల హక్కులను తాము కాపాడుతున్నామని చెప్పడమే పాకిస్థాన్ ఉద్దేశం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని కూడా వాదిస్తోంది. భారత్ ఉచ్చుర నుంచి కశ్మీరీలు పోరాడుతున్నారని ఈ పోరులో అమరులైన వారు కశ్మీరులు స్వతంత్ర సమరయోధులు అవుతారని అంటోంది. నిజానికి ఆ ప్రాంతంలో ప్రధాని, మంత్రివర్గమంటూ ఉండదు.

 

 

భారత్ చేస్తున్న అక్రమాలకు అక్కడి కశ్మీరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆ ప్రధాని పేరుతో నిన్న ప్రకటన రావడం చర్చనీయాంశమైంది. కశ్మీర్ పై భారత్ తీసుకుంటున్న చర్యలకు బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ ఇలాంటి కుట్రలను కొత్త కోణంలో ప్రపంచానికి చెప్తోంది. నిజానికి పీవోకేలో పాక్ ప్రధాని దగ్గరుండే ఓ చిన్న ఉద్యోగిని అక్కడ ఉంచుతుంది. కానీ.. ఇప్పుడు ఏకంగా ఆ వ్యక్తిని ప్రధాని అని సంబోధించి ప్రకటన చేయడమే విడ్డూరంగా ఉంది. దీనిపై భారత్ స్పందనేంటో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: