కరోనా వైరస్ దాడికి అమెరికా హాహాకారాలు చేస్తుంది... దీనికంతటికి కారణం ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు తలెత్తుతుండగా, ట్రంప్ మాత్రం చైనాను నిందిస్తున్నాడు.. అంతటితో ఊరుకోకుండా డబ్ల్యూహెచ్‌ఓ పై కూడా కారాలు మిరియాలు నూరుతున్నాడు.. ఇప్పటికే అమెరికాలో ఈ వైరస్ బారిన పడి వేలమంది చనిపోయారు.. రోజు రోజుకు ఇక్కడ కరోనా విస్తరిస్తుంది.. దీన్ని ఎలా అరికట్టాలో తెలియక అమెరికాతో పాటుగా అన్ని దేశాల శాస్త్రజ్ఞులు తలలుపట్టుకుని వారి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.. ఇలాంటి సమయంలో అసలే కోపానికి పరాకాష్ట అయిన ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే..

 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు అందజేసే విషయంలో తమ దేశం నుంచి అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. అంతే కాకుండా కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని, వైరస్ వ్యాపిస్తున్న తొలిదశలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలకు సంకేతాలు అందించలేదని.. ఈ విషయాన్ని కావాలనే కప్పిపుచ్చిందని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా విషయంలో చైనాకు పక్షపాతిగా వ్యవహరించిందని ఆయన మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ బాధ్యతాయుతంగా నడుచుకునేలా ఆదేశించే హక్కు సంస్థకు అత్యధిక నిధులు అందిస్తున్న అమెరికాకు ఉందని తెలిపారు..

 

 

చైనా సహా ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొన్న అత్యంత వినాశకరమైన నిర్ణయమని పేర్కొన్నారు.. ఇకపోతే అంతర్జాతీయ స్థాయిలో అనారోగ్య ముప్పు తలెత్తినప్పుడు ప్రపంచ దేశాలూ సరైన సమాచారం కోసం డబ్ల్యూహెచ్‌ఓపై ఆధారపడతాయని, కానీ, సంస్థ మాత్రం ఈ కనీస బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమై బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిదంటూ నిప్పులు చెరిగారు.. జరుగవలసిన నష్టం మొత్తం జరిగాక ఇప్పుడు గొంతుచించుకుంటే వచ్చే లాభం ఏముంది ట్రంప్ గారు అని కొందరు హితబోధ చేస్తున్నారు.. ఇక నిర్లక్ష్యం ఎవరిదైనా ప్రపంచం మొత్తం ఫలితాన్ని అనుభవిస్తుంది.. ఇప్పటికైనా మేధావులు అని చెప్పుకునే వారు బాధ్యతతో మెదులుతూ మరోసారి ఇలాంటి పరిస్దితి తలెత్తకుండా చూసుకుంటే మంచిది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: