దేశంలో కరోనా వైర‌స్ ఉధృత‌మ‌వుతున్న నేప‌థ్యంలో మే3 వ‌రకు లాక్‌డౌన్‌ను పొడ‌గిస్తున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి మోదీ మంగ‌ళవారం తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే కొన్ని రంగాల‌కు చెందిన వారికి ష‌ర‌తుల‌తో కూడిన స‌డ‌లింపునిస్తున్న‌ట్లు లాక్‌డౌన్‌పై తాజాగా విడుద‌ల చేసిన గైడ్‌లైన్స్ బట్టి అర్థ‌మ‌వుతోంది. బుధ‌వారం ఉద‌యం కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన  మార్గదర్శకాల ప్ర‌కారం.. వ్యవసాయ, ఉద్యానవన విభాగాలకు చెందిన అధికారుల‌కు, ప‌నుల‌కు, నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి అభ్యంత‌రాలుండ‌వు. లాక్‌డౌన్ నుంచి వీరికి ఉప‌శ‌మ‌నం ఉంటుంది. 

 

 రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలకు అనుమతిచ్చింది. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దుచేసింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి పాల్గొన‌వ‌ద్ద‌ని తెలిపింది. ఇక ఎప్ప‌టిలాగే మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేయాల‌ని సూచించింది. అత్య‌వ‌స‌రా సేవ‌ల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలు, మెడిక‌ల్ స్టోర్లు యధాతథంగా నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని తెలిపింది.  అలాగే ఫార్మ ఇండ‌స్ట్రీలో ఉత్పత్తికి అనుమతులను మంజూరు చేసింది. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలకు అనుమతి ల‌భించింది.

 

 ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు, బ్యాంకు కార్యకలాపాలకు కూడా అనుమ‌తులు ల‌భించ‌డం గ‌మ‌నార్హం. ఇక అలాగే, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. అయితే జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సర్వీసులు మే 3 వరకు నిలిపివేయనున్నట్టు పేర్కొంది. భద్రత విధులకు తప్ప బస్సు, రైలు మెట్రో సర్వీసులు నిలిచిపోతాయని స్ప‌ష్టం చేసింది. అత్యవసర వైద్యానికి మినహా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలు చేయ‌రాద‌ని సూచించింది.  సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: