క‌రోనా వైర‌స్ ఉత్త‌ర భార‌తాన్ని వ‌ణికిస్తోంది. దేశంలో వేగంగా విస్త‌రిస్తున్న వైర‌స్ మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో అయితే వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 11,400కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 370 మందికిపైగా మ‌ర‌ణించారు. మంగ‌ళ‌వారం రాజ‌స్థాన్ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన క‌రోనా కేసుల‌కు సంబంధించిన వివ‌రాల ప్ర‌కారం..ఆ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 1005కి చేరాయి. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 108 కొత్త కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. 

 

జోధ్‌పూర్‌లో 13, రాజ్‌కోట్‌లో ఎనిమిది, జ‌లావ‌ర్‌లో రెండు, జైస‌ల్మేర్‌, జున్‌జున్‌ల‌లో ఒక్కో క‌రోనా పాజిటివ్ కేసు ఉన్నాయి. అదే స‌మ‌యంలో రాజ‌స్థాన్‌ క‌రోనా పాజిటివ్ బాధితుల్లో ఇట‌లీకి చెందిన ఇద్ద‌రు, ఇరాన్ దేశానికి చెందిన 54 మంది ఉన్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 108 క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు రాజస్థాన్ అద‌న‌పు చీఫ్ సెక్ర‌ట‌రీ రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే ఇందులో 83 మంది కేవ‌లం రాజ‌ధాని జైపూర్‌లోనే ఉండ‌టంతో అధికారులు హైరాన ప‌డుతున్నారు. రాష్ట్రం మొత్తం క‌రోనా ప్ర‌భావం జైపూర్ జిల్లాలో అధికంగా ఉంది. 

 

ఈ జిల్లాలో 450కిపైగా కేసులు న‌మోద‌వ‌డంతో ఆరోగ్య స‌ర్వే చేప‌డుతున్నారు. వ్యాధి వ్యాప్తి కూడా అధికంగా ఉంది.మ‌హారాష్ట్ర , ఢిల్లీ, త‌మిళ‌నాడు త‌ర్వాత‌ పాజిటివ్ కేసులు వెయ్యి మార్కును దాటిన రాష్ట్రంగా నిలిచింది. ఇక ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా రాజ‌స్థాన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది మ‌ర‌ణించారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి మోదీ లాక్‌డౌన్‌ను మే3 వ‌ర‌కు పొడ‌గిస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం ఇందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న శాఖ‌ల్లోని కొన్ని విభాగాల‌కు మిన‌హాయింపునిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: