కరోనా సమయంలోనూ ఏపీలో రాజకీయ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. రాజకీయ పార్టీ ల మధ్య, పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఏపీ రాజకీయాలు చేస్తున్నారు. ఇక టిడిపి అధినేత చంద్రబాబు అయితే  కరోనా రాజకీయంగా వాడుకునేందుకు డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాడు. అందుకే ప్రతి చిన్న విషయాన్ని హైలెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో దీక్షలు చేయిస్తూ ప్రజల కోసం టిడిపి ఎంత గట్టిగా కృషి చేస్తుందో అనే విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటి కే పరిమితం అయ్యారు. ఆయన ఇప్పుడప్పుడే హైదరాబాద్ ను వదిలి ఏపీకి వచ్చే పరిస్థితి లేదు. 

IHG


 ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా అంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు చేస్తూ ప్రభుత్వం నుంచి చేపట్టే అన్ని కార్యక్రమాలు నిరాటంకంగా జరిగే విధంగా చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందిని సమన్వయం చేసి ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే కుప్పం ఎమ్యెల్యేగా ఉన్నా చంద్రబాబు ఇప్పట్లో ఏపీకి వచ్చే పరిస్థితి లేకపోయినా, తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు చేపట్టే విధంగా చేసే అవకాశం ఉన్నా, ఆయన మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. 

 


కనీసం స్థానికంగా ఉన్న నాయకుల ద్వారా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నా, ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి గా ఉండి ఉంటే కుప్పం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అది కూడా ఇంటి కే పరిమితం అయ్యారు. ఈ సమయంలో ఇంటి నుంచే కుప్పంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేసే అవకాశం ఉన్నా, ఏ మాత్రం ఆ విషయంపై దృష్టి పెట్టడంలేదు. దీనిపై కుప్పం నియోజకవర్గం ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. నిత్యం హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ... పార్టీ శ్రేణులతో సంభాషిస్తున్న బాబు నియోజకవర్గంపై కూడా దృష్టి సారిస్తే మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: