భారతదేశంలో కోవిడ్-19 రోజురోజుకి అసామాన్య రీతిలో వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో కేసులు ఉన్న వాటికన్నా మరీ తక్కువగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తోందని ఆరోపణలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కలకత్తా లాంటి మహా నగరం ఉన్న రాష్ట్రంలో కేవలం 100 నుండి 150 మధ్య కేసులు మాత్రమే ఇప్పటివరకు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే.. తబ్లిజి జమాత్ వంటి ఘటన తర్వాత కూడా అక్కడి కేసుల సంఖ్య లో మాత్రం వృద్ధి లేకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం కేవలం ఓట్ల కే ప్రాధాన్యతనిచ్చి అక్కడ ఉన్న కేసులను తక్కువ చూపించడం మరియు సాంఘిక వ్యాప్తి జరిగిన తర్వాత కూడా కరోనా వల్ల సంభవించే మరణాలను సాధారణ మరణాల కింద జమ చేయడం చేస్తున్నారట. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వీరికి సరైన సూచనలు ఇచ్చినా కూడా అవసరమైన స్థాయిలో అనుమానితులను క్వారంటైన్ కు పంపే చర్యలు ఇంకా చేపట్టకపోవడం కూడా అందరినీ ఆందోళన పరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు యాదృచ్చిక తనిఖీలు జరపమని ఆదేశాలు జారీ చేసినా కూడా అక్కడ అటువంటివి ఏమి జరగకపోవడంతో బెంగాల్ గురించి అంతా తీవ్రమైన అభ్యర్థనలు చేస్తున్నారు.

 

ఇకపోతే బిజెపి కి వ్యతిరేకమైన మమతా బెనర్జీ కేరళ మరియు ఒడిశా రాష్ట్రాల నుండి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అంటున్నారు. కేరళ లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తు. తప్పకుండా పాటించి తమ సొంత ప్రణాళికలతో వారు కరోనాను నియంత్రించిన తీరు మరియు ఒడిశా రాష్ట్రం కూడా పుంజుకున్న తీరు చూసి మమతాబెనర్జీ రాజకీయ కారణాలను పక్కనపెట్టి ఇకనైనా పరిస్థితికి అనుకూలంగా వ్యవహరించకపోతే రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వైరస్ సోకి దేశమంతా మరో ఇటలీ, అమెరికా, ఇరాన్ లాగా మారుతుందని అంతా భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: