ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కరోనా  వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యం గా మారిపోయింది. ఏకంగా వందల్లో  ఉన్న కరోనా  కేసుల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం వేగంగా పదివేలు దాటి పోయింది . దీంతో రోజు రోజుకు భారత్లో పరిస్థితి చేయి దాటి పోయే లా కనిపిస్తుంది. అయితే భారత ప్రభుత్వం ప్రజలందరినీ ఇంటికే పరిమితం కావాలని... వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నప్పటికీ ... కొంత మంది నిర్లక్ష్యం కారణంగా కరోనా  వైరస్ రోజురోజుకు పెరిగిపోతోంది. 

 

 

 ముఖ్యంగా భారతదేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య అమాంతం ఒక్కసారిగా పెరిగి పోవడానికి కారణం ఢిల్లీలో జరిగిన మత  ప్రార్ధన సమావేశం మర్కజ్  అన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ముస్లిం సోదరులు మార్కజ్  సమావేశానికి వెళ్లారు.. ఈ సమావేశానికి ఇండోనేషియా లాంటి ఇతర దేశాల నుంచి కూడా మత ప్రబోధకులు వచ్చారు. ఇక ఈ సమావేశం అనంతరం ఇక్కడికి వెళ్లిన దాదాపు అందరూ కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షల్లో  పాజిటివ్ అని తేలుతోంది. మత ప్రార్థన  సమావేశానికి వెళ్లిన వారికి ఆ తర్వాత వీరి ద్వారా ఇంకొకరికి వారి నుండి ఇంకొకరికి అలా కరోనా వైరస్  భారతదేశంలో విస్తరించి పోయింది.  క్రమక్రమంగా పెరిగి పోయిన కరోనా  భారత దేశంలో ఎంత మందిని బలి తీసుకుంటుంది. 

 

 

 ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ధుధారా  పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువకుడు ఆరు నెలల క్రితం మతం మార్చుకుని ఇస్లాం మతంలో చేరాడు.అయితే  ఢిల్లీలో జరుగుతున్న మార్కజ్  సమావేశానికి హాజరయ్యారు. ఇక మర్కజ్  సమావేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. ఆ యువకుడికి కరోనా  పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ యువకుడు సీతాపూర్ ఆస్పత్రిలో చేరి ప్రత్యేక ఐ సొల్యూషన్ వాటిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆ  యువకుడికి పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ యువకుడు ఇస్లాం మతంలోకి మారి ముస్లిం అయ్యాడని దర్యాప్తులో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: