దేశంలో ప్రజలందరూ మొదటినుండి ఊహిస్తున్న విధంగానే ప్రధాని మోదీ లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు. అయితే ఏప్రిల్ 20 నుంచి సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని మోదీ ప్రకటన చేశారు. తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు లాక్ డౌన్ ఎత్తివేతకు తొలి అడుగు ఏప్రిల్ 20న పడనుందని తెలుస్తోంది. కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించినా దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 20 నుంచి కేసులు నమోదు కాని ప్రాంతాలలో ఆంక్షలు ఎత్తివేయనుంది.
 
కేంద్రం సడలింపుల గురించి ఇప్పటికే చూచాయగా లీక్ చేసింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 20 నుంచి దేశంలో ఏప్రిల్ 20 నుంచి గూడ్స్ రవాణా వ్యవస్థలకు అనుమతి లభించనుందని సమాచారం. కేంద్రం ఇప్పటికే వ్యవసాయ రంగానికి మినహాయింపులు ఇవ్వగా ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయేతర రంగాలకు కూడా మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ప్రభుత్వ కార్యాలయాలలో 30 శాతం సిబ్బందిని అనుమతించనుందని తెలుస్తోంది. 
 
కేంద్రం ఆంక్షలు పాక్షికంగా ఎత్తివేసినా ప్రజలందరూ సామాజిక దూరం పాటించేలా, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేలా కేంద్రం చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది . కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులకు పనులు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కాల్వల నిర్మాణ పనులకు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా కేంద్రం అనుమతులు ఇవ్వనుందని తెలుస్తోంది.         
 
అయితే కేంద్రం జనం ఎక్కువగా గుమికూడే ప్రాంతాలపై మాత్రం యథావిధిగా ఆంక్షలు కొనసాగించనుందని తెలుస్తోంది. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, రైల్వే సర్వీసులు, బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ పై ఆంక్షలు యథావిధిగా కొనసాగనున్నాయని తెలుస్తోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: