జగన్ ముఖ్యమంత్రిగా పది నెలల పదిహేను రోజులు పూర్తి చేసుకున్నారు. మరో వైపు పదేళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా పూర్తి అయింది. జగన్ కి రాజకీయంగా ఇపుడు అనుకూలతలు ఎన్ని ఉన్నాయో ప్రతికూలతలు కూడా అన్నీ  కనిపిస్తున్నాయి. దాంతోనే జగన్ కి గట్టి షాకులు వరసగా తగులుతున్నాయి.

 

ఫ్యూచర్లో కూడా మరిన్ని షాకులు  రెడీగా కూడా ఉన్నాయనుకోవాలి. జగన్ ముక్కుసూటిగా వెళ్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా వరకూ ప్రజలకు మేలు జరిగేవి ఉన్నా కూడా ఎందుకో ఆయన కోర్టుల్లో ఓడిపోతున్నారు. దీని మీద అనేక రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

జగన్ తరఫున న్యాయవాదులు కోర్టులో  బలమైన వాదనలు వినిపించలేకపోతున్నారని అంటున్నారు. నిజానికి జగన్ జీవోలు, వాటి ఆవశ్యకత, పూర్వ రంగం వంటివి సమర్ధంగా వివరించడంలో ప్రభుత్వ ప్లీడర్లు అనుకున్నంతగా పనిచేయలేకపోతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. జగన్ పది నెలల పాలనలో వరసగా కోర్టుల నుంచి మొట్టి కాయలు తప్పడంలేదు.

 

ఇంతలా కోర్టుల నుంచి మొట్టికాయలు తిన్న సర్కార్, అదీ స్వల్ప కాలంలో మరోటి లేదని అంటారు. దీనికి జగన్ తొందరపాటు శైలితో పాటు దూకుడుగా ప్రభుత్వ  ఉత్తర్వులను తీసుకురావడం వెనక కసరత్తు చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి వస్తోందని అంటున్నారు.

 

ఇంకోవైపు జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయం రాజకీయం కావడమే కాదు, న్యాయస్థానాల్లో సవాల్ చేయడమూ అలవాటుగా మారిపోయింది. దాని వల్ల పాలన సాఫీగా సాగకుండా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జనాల్లో వచ్చిన చైతన్యమో రాజకీయ పార్టీల ప్రోత్సాహమో తెలియదు కానీ ప్రజా వ్యాజ్యాలు  ఇటీవల ఎక్కువైపోతున్నాయి. మరి జగన్ కి ఇప్పటిదాకా జరిగింది వేరు. మరిన్ని గట్టి షాకులు కోర్టు నుంచి రాబోతున్నాయని అంటున్నారు.

 

ప్రస్తుతం మాజీ  ఎస్ఇసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ వ్య‌వహారం కోర్టులో ఉంది. వచ్చే వారం దాని మీద తీర్పు రానుంది. మరి అదెలా వస్తుందో అన్న భయం వైసీపీ సర్కార్ లో ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: