ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు కరోనా భయంతో వణికి పోతుంది.  అయితే ఈ ఏడాది ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్తాం అనుకున్న డొనాల్డ్ ట్రంప్ కి అంతా తలకిందులయ్యింది.  లక్షల్లో కరోనా కేసులు.. వేలల్లో మృతి ఇప్పుడు అంతా అగమ్యగోచరంగా మారింది. మొత్తానికి ఇప్పుడు అగ్ర రాజ్యపు అభివృద్ది ఢొల్లతనాన్ని ప్రపంచాన్ని చూపించింది.. అంటే కరోనా సంక్షోభ సమయంలో ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న భారీ యంత్రాంగం కూడా కరోనా సంక్షోభం వచ్చినపుడు తట్టుకొని నిలబడలేవు అన్నదానిపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి.ఇంత ఘోరమైన సంక్షోభానికి సృష్టికర్త అయిన చైనాని తన భుజం పై వేసుకొని ప్రపంచాన్ని మోసం చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.

 

చైనా పక్కన ఉన్న తైవాన్ లాంటి వాళ్లు మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ పాకుతుందని.. దీని వల్ల పెను ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది.. కానీ అలాంటిది ఏమీ లేదని చైనా కొట్టి పడేసింది.  అయితే ఈ విషయంపై ప్రపంచ దేశాలు కూడా ఒకసారి చెక్ చేసి చెప్పండి అనగా స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఛీప్ అక్కడకు వెళ్లి అక్కడ ఉన్న హెడ్ తో మాట్లాడి అబ్బే అక్కడ ఏమీ లేదని కన్ఫర్మేషన్ ఇస్తూ జనవరి రెండవ వారం వరకు ఏమీ లేదంటూ చెప్పారు.  అయితే చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లి వారికి ఈ కరోనా వ్యాప్తి చెందడంతో దీన్ని గ్రహించిన ఇది పెద్ద సమస్యగా మారుతుందని చెప్పి అవును ఇది ఒకరి నుంచి ఒకరి సంక్రమిస్తుందని చెప్పుకుంటూ వచ్చారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.

 

అప్పటికే ఫిబ్రవరి మొదటి వారం వరకు వచ్చింది.. అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతూ వచ్చింది. అప్పటికే ఈ కరోనాని చైనాలో కట్టడి చేయకపోవడం.. అక్కడ నుంచి చాలా మంది విదేశాలకు వెళ్లడం.. పెను సంక్షోభానికి దారి తీసింది. ఇప్పుడు 202 దేశాల ఈ కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్నారు. అయితే దీనంతటికి కారణం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ట్రంప్ కి తీవ్ర ఆగ్రహం కలిగించింది.  ఈ విషయం గతంలో ఒపెన్ గా చెప్పారు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాల ఫండింగ్ తో నడుస్తుంది. అమెరికా ఒక్కటే 15 శాతం ఫండింగ్ చేస్తుంది.  ఈ నేపథ్యంలో ఆ 15 శాతం ఫండింగ్ ఆపివేశారు.. ఛీఫ్ ని రిజైన్ చేసి వెళ్లిపొమన్నారు. అయితే ఆయన రిజైన్ చేయడం లేదు.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏమీ యాక్షన్ తీసుకోవడం లేదు. మరి ట్రంప్ ఆగ్రహ ఫలితం ఎక్కడిదాకా పోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: