భార‌త‌దేశంలోనే ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఏమిటంటే... ఖజురాహో . ఇక్క‌డ ఎంతో అంద‌మైన శిల్ప వైభవం ఉంటుంది. దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో. తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు నిర్మితమైన దేవాలయ సముదాయం ఇది. ఈ దేవాల‌య చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల కళా సృష్టికి దర్పణం. 85 దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25మాత్రమే.

 

పురుషాంగ రూపంలో 'లింగ'మయ్య ఇక ఇక్కడకు వెళితే శృంగార పరమైన కోరికలు పెరుగుతాయ‌ని పూర్వికులు అంటుంటారు. ఆ సామర్థ్యం కూడా పెరుగుతుందని చెబుతారు. ఇందుకు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఖజురహో శిల్పాలను గాంధీ అసహించుకుంటే మన విశ్వకవి ఠాగూర్ ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ ఖజురహో దేవాలయాలు ఓ కుమారుడికి తల్లి పై ఉన్న గౌరవానికి ప్రతీకగా నిర్మించినవన్నీ అతి త‌క్కువ మందికి ఈ విష‌యం  తెలుసు. 

 

ఈ దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు సంస్కృతం భాష మూలంగా వచ్చింది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము.  భార‌త‌దేశంలో మొత్తంలోనే ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించ‌డానికి ఈ  క్షేత్రానికే వెళ‌తారు. చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల కళా సృష్టికి దర్పణం. మొత్తం ఇక్క‌డ ఉండేది 85దేవాలయాలు. అయితే ఇప్పుడు మిగిలింది మాత్రం కేవలం 25మాత్రమే. ఖజురహో సాగర్ ఒడ్డున ఈ గ్రామం  ఉంటుంది. ఇక్క‌డ దాదాపు ఎనిమిది వేల మంది జనాభా ఉంటారు. మధ్యప్రదేశ్ లో చట్టర్పూర్ జిల్లాలో ఈ  ఖజురహో ఉంది. అలేక్సాందర్ కన్నింగ్ హాం ఖజురాహో అంటే ‘ఖర్జూర వనం' అని అర్ధం వస్త‌ది. ' దీనిని ఆ రోజుల్లో ‘ఖర్జూర వాటిక'అనే వారు. అది ఉచ్చస్తితి లో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూర పంట అధికంగా ఉండేది. దీనికి సాక్ష్యంగా రెండు బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి .అయితే ఈ  ఆలయాలపై బూతు బొమ్మలు ఎక్కువ‌గా ఉంటాయి. వాటిని విడి గా చూడకుండా మొత్తం ఒకే ద్రుష్టి తో చూడాలని మ‌న చరిత్రకారులనేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: