అభిజ్ఞా ఆనంద్‌ పరిచయం అవసరం లేని పేరు. మైసూరు లో పుట్టిన ఈ బాలమేధావి కీర్తి కేవలం మన భారత దేశానికే పరిమితం కాలేదు. విదేశాల్లో సైతం అభిజ్ఞా ఆనంద్‌ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయాడు. విదేశాల పత్రికల్లో కూడా అభిజ్ఞా ఆనంద్‌ పేరు మారుమ్రోగుతోంది. 14 సంవత్సరాలో ఇంతటి జ్ఞానం పొందిన అభిజ్ఞా మనదేశంలో పుట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అయితే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ మహమ్మారి నుండి ఎప్పుడూ మనకి విముక్తి అంటూ వారి వారి దేవుళ్ళను అర్థిస్తూ ఉన్నారు ప్రజలు. అయితే మే 29న ఒక అద్భుతం జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు అభిజ్ఞా. పూర్తి విషయంలోకి వెళ్తే ఆరు వారాల పాటు ప్రపంచమంతా అంధకారంలో ఉంటుందని, 2019 నవంబర్ నుండి ఏప్రిల్ 20 వరకు గడిచే సమయమంతా ఒక పీడ కలగానే మిగిలి ఉంటుందని అభిజ్ఞా ఆనంద్‌ ఎప్పుడో చెప్పాడు.

 

అతడు చెప్పినట్టుగానే ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో పరిస్థితులు మారాయి. అయితే నవంబర్ లో పుట్టిన ఈ వ్యాధి మార్చి 29 నుండి ఏప్రిల్ 2 వరకు బాగా విస్తరిస్తుంది అని చెప్పాడు. ఈ బాలమేధావి చెప్పినట్టుగానే మార్చి 29న నిజాముద్దీన్ ఘటన అందరిని ఉలికి పడేటట్టు చేసింది. ఇక ఆ తర్వాత దేశవ్యాప్తంగా అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా కేసులు బాగా ఎక్కువ నమోదు అయ్యాయి. దీంతో పరిస్థితి అదుపులోకి వస్తుందా అన్న రీతిలో భయపడుతున్న సందర్భంలో ఒక మంచి శుభవార్త చెప్పాడు అభిజ్ఞా. మే 29న గ్రహాల మార్పులతో శుభం జరగబోతుంది. ఇప్పటివరకు అశుభ ఫలితాలు ఇచ్చిన గ్రహాలు. మే 29 నుండి శుభాలు ఇవ్వబోతున్నట్లు చెప్పాడు.

 

మే 29 నుండి కేసులు తక్కువ స్థాయిలో నమోదు అయి జూన్ మొదటి వారం నుండి తగ్గుముఖం పడతాయని చెప్పాడు. మార్చి 29న వ్యాధి విజృంభణకు ఎంత కీలకమో మే 29 వ్యాధి తగ్గుదలకి కూడా అంతే కీలకం అని చెప్పాడు. అభిజ్ఞా ఈ వార్త తెలియజేయగానే...అభిజ్ఞా మాటలకు ప్రజలు సంతోషిస్తున్నారు. రాబోయే కాలంలో ఏం జరగబోతుందో ముందుగానే చెబుతున్న ఈ బాలమేధావి మనదేశంలో పుట్టడం విదేశాల్లో కూడా అభిజ్ఞా ఆనంద్‌ పేరు మారుమ్రోగడం అంటే నిజంగా మనం గర్వించదగ్గ విషయమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: