భారత దేశ ప్రభుత్వం విడుదల చేసిన ‘ఆరోగ్య సేతు’ అప్లికేషన్‌ డౌన్‌ లోడ్లు కేవలం 13 రోజుల్లో ఏకంగా 5 కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. ఈ యాప్ ని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2న విడుదల చేసింది. కరోనా వైరస్ కాంటాక్ట్‌ లను ట్రేస్‌ చేయడం ద్వారా దేశంలో కరోనా విస్తృతిని నియంత్రించడానికి ఉద్దేశించింది ఈ యాప్ సారాంశం. అయితే ఈ యాప్ విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 50 లక్షల డౌన్‌ లోడ్లు అయ్యాయి.

 

 

నితి ఆయోగ్‌ CEO అమితాబ్‌ కాంత్‌ ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఓ ప్రకటన విడుదల చేసారు ఆయన. అయితే కేంద్ర ప్రభుత్వం సదుపాయంతో తయారుచేయించిన ఈ యాప్‌, దేశంలో కరోనా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కు ఉపయోగపడేలా రూపొందించారు. నిన్నటి రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో ‘ఆరోగ్యసేతు’ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని ప్రోత్సహించిన కేవలం 24 గంటల్లోనే కోటికి పైగా డౌన్‌లోడ్లు కావడం రికార్డుగా చెబుతున్నారు. 

 


అయితే ఈ యాప్ ని ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా ఈ యాప్‌ ను వాడాల్సిందిగా తమ సిబ్బందికి, సభ్యులకు వారు సూచించారు. ఈ ‘ఆరోగ్యసేతు’ యాప్‌, ఆండ్రాయిడ్‌, ios రెండింటిలోను అందుబాటులో ఉంది. కేవలం ఇంగ్లీష్‌, హిందీ మాత్రమే కాక, ఇది అన్ని ముఖ్యమైన భారతీయ భాషలలో కూడా ఈ యాప్ లభ్యమవుతోంది. అయితే వినియోగదారులు ఈ యాప్‌ ను వాడేప్పుడు మాత్రం బ్లూటూత్‌, లొకేషన్‌ ఆక్సెస్‌ అనుమతులు మాత్రం కచ్చితంగా ఇవ్వాలి. దీనితో ఇది కొవిడ్‌ బాధితుల జాడ కనుగొనేందుకు మార్గం సులువు అవుతుంది. ఇందులో వినియోగదారులను కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని అంచనావేసి, సురక్షితంగా ఉన్నారో లేదో ఈ యాప్ తెలుపుతుంది. అంతేకాదు, మనం ఎవరైనా కరోనా పాజిటివ్‌ వ్యక్తిని కలిసామా? లేదా అన్నది కూడా ఇది తెలుపుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: