గత కొంత కాలంగా ఏపిలో రాజకీయ వేడి ఏ రేంజ్ లో రాజుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వల్ల నానా అవస్థలు పడుతున్నారు.  ఈ సమయంలో ఏపి సీఎం ప్రతిరోజూ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు.  ఈ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార ప్రభుత్వంపై సెటైర్లు వేయడం... విమర్శలు చేయడం చేస్తున్నారు. 

 

అధికారులు, వాలింటైర్ల పనితీరు పై విమర్శలు జల్లుతున్నారు.ఈ విషయంపై వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై ట్విట్టర్ వేధికగా ఫైర్ అయ్యారు.  పెద్ద నోట్ల రద్దు సలహా తనే మోదీకి ఇచ్చానని అప్పట్లో డప్పుకొట్టుకున్నాడు. క్రెడిట్ కొట్టేయాలని చూసినా ప్రధాని హుందాతనంతో వదిలేశాడు.3జోన్ల పద్ధతి ప్రవేశ పెట్టాలని ఎప్పుడో లేఖ రాశాడట. ఉదయం ఫోన్ వస్తే 4 గంటలు ఓపిక పట్టలేనోడు,లేఖ విషయం ఇన్నాళ్లు దాచాడంటే అది బోగస్ అని తెలుస్తూనే ఉంది అని విమర్శించారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: