చంద్రబాబు. అవును ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయన పుడుతూనే రాజకీయంగా పండిపోయారు. ఆయన వ్యూహాలు ఎవరికీ చేత కావు. చీ కొట్టిన నోటితోనే జై కొడతారు. జై కొట్టి మళ్ళీ దూరం పెడతారు. బాబు రాజకీయం ఎపుడెలా ఉంటుందో ఎవరికి అర్ధం కాదుగా.

 

ఇక చంద్రబాబు పేరుకు జాతీయ నాయకుడు. ఆయన్ని వైసీపె నేతలు జాతి నాయకుడు అంటారు. ఇక చంద్రబాబు జాతీయ నాయకుడుగా దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చక్రం తిప్పడంలేదు. మొన్నటి దాకా ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు కదా. తనను తొలిసారి సీఎంని చేసిన తెలంగాణా మీద కూడా బాబుకు ప్రేమ ఉండాలి కదా.

 

బాబు మాత్రం లాక్ డౌన్ నేపధ్యంలో హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కానీ కేసీయార్ వైపు కన్నెతి చూడరు, పన్నెత్తి ఒక్క మాట కూడా అనరు. అంటే ఇక ఏమైనా ఉందా. అందుకే ఆయన అలా తెలంగాణాను  కావాలనే  పక్కన పెట్టేస్తున్నారు.

 

కానీ పొరుగు రాష్ట్రంలో ఉండి ఏపీకి మాత్రం సుద్దులు చెబుతారు. తానూ తన పార్టీ ఒట్టేసుకుని మరీ విరాళాలు కూడా పెద్దగా విదల్చలేదు. ఇక సెల్ఫ్ క్వారంటైన్ విధించుకుని మరీ ఇళ్ళ నుంచి బయటకు రాని మహా మాజీ మంత్రులు ఎందరో ఉన్నారు.

 

ఇంత చేస్తున్న బాబు మాత్రం జగన్ మీద పడి ఆడిపోసుకుంటారు. జగన్ పాలన సరిగా చేయడంలేదుట. కరోనాని సరిగ్గా ఎదుర్కోలేదుట. కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయట. మరి తానున్న తెలంగాణాలోనూ ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి.

 

ఏపీ కంటే కూడా అక్కడ కేసులు ఎక్కువే కూడా అయినా బాబు గొంతు ఎందుకో కేసీయార్ని చూస్తే మూగబోయిందేమో. కేసీయార్ ఫెయిల్యూర్ అని అనగలరా. తెలంగాణాలో  కేసులు ఇన్ని పెరిగాయేంటే కేసీయార్ అంటూ గద్దించగలరా.

 

అమ్మో ఆ పని మాత్రం చేయరు. పైగా జాతీయ అధ్యక్షుడు మరి. కానీ తెలంగాణా తలుపు మూసుకున్నారు. ఏపీ విషయంలోనే గట్టిగా గొంతెత్తి మాట్లాడుతారు. జగన్ మీదనే విరుచుకుపడతారు. కానీ ఇదే బాబు కేసీయార్ని కెలికి చూస్తేనా. భారీ షాకేగా. ఆ మాత్రం తెలియదా స్వామీ. అందులే పదమూడు జిల్లాల ఏపీకే జాతీయ ప్రెసిడెంట్ ఆయన. అంతే అనుకోవాలి. అలాగే సంబరపడాలి తమ్ముళ్ళు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: