దేశంలో కరోనా వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉండడంతో మే మూడో తారీఖు వరకు లాక్ డౌన్ నీ మోడీ పొడిగించిన సంగతి అందరికీ తెలిసినదే. ఏప్రిల్ 14 వ తారీకు జాతినుద్దేశించి మోడీ మాట్లాడిన సమయంలో షరతులతో కూడిన సరికొత్త మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 20వ తారీఖున మరో సరికొత్త ప్రకటన ఉండబోతున్నట్లు మోడీ స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక వేళ లాక్ డౌన్ ఏప్రిల్ 20వ తారీఖున ఎత్తేస్తే ఏం జరుగుతుంది అన్నది ప్రజలలో క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది.

 

ప్రస్తుతం దేశంలో పరిస్థితి చూస్తుంటే రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అనుకోని విధంగా చాపకింద నీరులా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేసే టైం వస్తే కనుక మరో అమెరికా, ఇటలీ దేశంగా ఇండియా అవుతుందని మేధావులు అంటున్నారు. చాలావరకు పాజిటివ్ కేసులు చికిత్స తీసుకుని కోలుకున్నాక రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన...మళ్లీ అదే పర్సన్ కి వైరస్ పాజిటివ్ రిజల్ట్ వస్తున్నట్లు ఇటీవల కొన్ని కేసులు బట్టి తేలింది.

 

ఆంక్షలతో లాక్ డౌన్ ఎత్తేసిన...సరిగ్గా ఆలోచిస్తే మళ్లీ పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది. దీంతో అంటే జూన్ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగింపు ఉంటుంది అని ఈజీగా అర్థమవుతుంది. ప్రస్తుతం గనుక ఒకవేళ కేసులు తగ్గుముఖం పడితే అప్పుడు కేంద్రం మరో సరికొత్త షరతులతో ప్రజల ముందుకు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే అమలవుతూ వస్తున్న లాక్ డౌన్ మాత్రం...జూన్ నెలాఖరు వరకు పొడిగించే అవకాశం ఉందని ఈజీగా అర్థమవుతుంది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: