IATA అంచనాల ప్రకారం భారతదేశంలో 20 లక్షలకు పైగా విమాన రంగంలో ఉద్యోగాలు కోల్పోతాయని తెలుపుతోంది. దీనికి ముఖ్య కారణం కారణం కరోనా వైరస్ అని చెప్పుకోవచ్చు. దేశీయ, అంతర్జాతీయ విమానాల సర్వీసులను మోడీ ప్రకటించిన లాక్ డౌన్ తో మే 3 వరకు అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిసిన విషయమే. అయితే ఇది కేవలం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి మాత్రమే. అయితే దీనికి ఏకంగా 11 వేల మంది విమాన రంగంలో వారు ఇబ్బంది పడాల్సి ఉంది.

 


IATA అంచనాల ప్రకారం... ప్రపంచంలో వేగంగా 314 బిలియన్ డాలర్లు విమాన రంగం నష్ట పోతుందని అంచనా వేస్తున్నారు. అలాగే 2019 సంవత్సరంతో పోలిస్తే 48% ప్యాసింజర్ డిమాండును కోల్పోతుందని తెలియజేసింది. ప్రస్తుతం విమాన రంగం తీవ్ర ఆర్ధిక నష్టాల్లో కూరుకు పోయిందని చెప్పవచ్చు. దీనికి కారణం 61 బిలియన్ డాలర్లు డబ్బులను సెకండ్ క్వాటర్ లో  రిజర్వ్ చేయాల్సి ఉంది. ఇక మంగళవారం IATA సీఈవో అలెగ్జాండర్ డి జునియాక్ చెప్పిన నివేదిక ప్రకారం విమాన రంగం చీకటి మయంగా తయారవుతుందని తెలిపారు.

 


ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం విమాన రంగం యొక్క సూచీలను తెలుపుతూ v ఆకారం గల గ్రాఫ్ ను పునరుద్ధరణకు అవకాశం ఉండదని కానీ, వాస్తవంగా ఇది దేశీయ విమానాలకు ప్రాణాలకు U ఆకారపు రికవరీ అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే తను చూసిన దాంట్లో ప్యాసింజర్ల యొక్క వార్షిక ఆదాయంలో సగం పైగా నష్టపోయారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే విమాన రంగంలో 25 మిలియన్ ఉద్యోగాలకి కొత్త పడుతుందని భావిస్తున్నామని అయన తెలిపారు. అంతేకాకుండా కొన్ని విమాన రంగాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి నోటీసు లేకుండా ఉద్యోగస్తులను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు అంటూ తెలిసింది అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సెలవుదినాల్లో వారికి జీతభత్యాలు రావని సదరు విమాన రంగ సంస్థలు చేస్తున్నాయని అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: