లాక్ డౌన్ ఈ పదం ఈ తరానికి బాగా పరిచయం అయిపోయింది. మన పూర్వీకుల టైంలో కూడా వందేళ్ళకు ఒకసారి వైఅరస్ లు వీర విజ్రుంభణ చేసాయట. అయితే అపుడు టెక్నాలజీ లేకపోవడం జనాలు ఇళ్ళ పట్టునే ఉండే వారు కాబట్టి వారికి ఈ బందుల ఇంబ్బందులు తెలిసి ఉండకపోవచ్చు.

 

కానీ నేటి తరం అలా కాదు, ప్రపంచం నలుమూలలూ తిరిగేస్తోంది. అంతేకాదు, ఇరవై నాలుగు గంటలు సరిపోవంటూ గోల పెడుతోంది. ఎపుడూ బిజీ బిజీగా ఉంటోంది. అటువంటి తరాన్ని తాళం పెట్టి ఇంట్లో కూర్చోబెట్టేసింది కరోనా వైరస్.

 

మరి కరోనా వైరస్ పుణ్యమా అని లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ఇప్పటికి రెండు విడతలుగా పెంచేశారు. ఇది మే 3 తో ముగుస్తుందని అని అంతా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఓ వైపు కేసులు బాగా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

 

దాంతో పాటే వేగంగా కరోనా విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో అప్పటికి కూడా కరోనా అదుపులోకి రాకపోతే మాత్రం మరింత కాలం పెంచుకుంటూ పోతారని అంటున్నారు. అంటే మే 3 తరువాత కూడా మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని అంటున్నారు.

 

కరోనా ఎపుడు జీరో స్థాయికి వస్తుందో అపుడే ఈ లాక్ డౌన్ని ఎత్తివేస్తారు. ఈ లోగా ఎక్కడెక్కడ కేసులు లేవో అక్కడ మాత్రం వెసులుబాటు ఇస్తారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కరోనా మహమ్మారి పుణ్యమా వచ్చినా లాక్ డౌన్ లాక్ ఎవరి చేతుల్లో ఉంది అంటే జనం చేతుల్లోనే.

 

జనం విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే మాత్రం కేసులు పెరుగుతాయి. లాక్ డౌన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందువల్ల లాక్ డౌన్ని గౌరవించి ఇంట్లో కూర్చుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అందువల్ల లాక్ ప్రజల చేతుల్లోనే ఉంది. అది ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: