ప్రపంచాన్ని గజగజ లాడిస్తూన్న కరోనా వైరస్ కి ఇంకా మెడిసిన్ గానీ, వ్యాక్సిన్ గానీ ఎవ్వరూ కని పెట్టలేక పొయ్యారు. దీంతో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అదేవిధంగా మరణాలు వేల సంఖ్యలో సంభవిస్తున్నాయి. మరోపక్క వైరస్ నియంత్రించడానికి అన్ని దేశాల నాయకులు ప్రజలను ఇళ్లకి పరిమితం చేసి దాదాపు లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్ధికసంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఎక్కువగా ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ప్రమాదకర స్థితిలో ఉంది. దానికి కారణం చూస్తే అమెరికా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించకపోవడం. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో గాని, కరోనా వైరస్ వల్ల చనిపోయిన మరణాల విషయంలో గానీ అమెరికా మొదటి స్థానంలో ఉంది.

 

ఇక వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో ఎక్కువగా వృద్ధుల సంఖ్య ఉంది. దానికి కారణం చూస్తే వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లే….అని వైద్యులు తెలుపుతున్నారు. ఇటలీ లో గాని అమెరికాలో గాని అదేవిధంగా స్పెయిన్ లో వైరస్ వల్ల మరణించిన వారిలో ఎక్కువగా ఉన్నది వృద్ధులే అని అంతర్జాతీయ లెక్కలు చెబుతున్నాయి. దీని గురించే  అనుకుంటా ఇటీవల ప్రధాని మోడీ ఏప్రిల్ 14న జాతినుద్దేశించి ప్రసంగించిన టైములో ఇంటిలో పెద్దవాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం జరిగినట్లు తెలుస్తోంది.

 

కరోనా వైరస్ విషయంలో అంతా ఒకలా ఉంటే ఏపీలో మాత్రం వైరస్ ప్రభావం కుర్రాళ్ళ పై ఎక్కువగా ఉన్నట్లు బిగ్ బ్రేకింగ్ న్యూస్ లు వస్తున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులలో అత్యధికంగా యువతే ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో రాష్ట్రంలో ఇష్టానుసారంగా లాక్ డౌన్ టైం లో తిరుగుతున్న కుర్రాళ్ళకి ఈ వార్త బిగ్ బాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రతి చోట వృద్ధులపై ప్రభావం చూపిస్తుంటే ఏపీలో యువతపై వైరస్ ప్రభావం చూపడం పట్ల వైద్యులకు కూడా ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: