ఇండియాలో మొదటి కరోనా కేసు నమోదైన  కేరళలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. యాక్టీవ్ కేసుల సంఖ్య కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈరోజు కేవలం ఒకే ఒక్క కరోనా కేసు నమోదైయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెల్లడించారు. దాంతో ఇప్పటివరకు  కేరళ లో మొత్తం 387 కేసులు నమోదు కాగా 173కేసులు యాక్టీవ్ గా వున్నాయి అలాగే 218 మంది కోలుకోగా ఇద్దరు మరణించారు. 
 
ఇక మిగితా రాష్ట్రాల విషయానికి వస్తే మహారాష్ట్ర, గుజరాత్ ,రాజస్థాన్ లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తుంది. రోజురోజుకు అక్కడ అధిక సంఖ్య లో కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తుంది.  ఒక్క మహారాష్ట్ర లోనే ఈరోజు ఏకంగా 232 కేసులు నమోదయ్యాయి. మొత్తం అక్కడ కేసుల సంఖ్య 3000కు చేరుకోగా 187 మంది మరణించారు. మొన్నటి దాక మహారాష్ట్ర తో పోటీపడ్డ ఢిల్లీ, తమిళనాడు లో రెండు రోజుల నుండి కేసుల సంఖ్య తగ్గింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో గత రెండు రోజుల నుండి కేసుల సంఖ్య పెరుగగా ఈరోజు  కేవలం 6 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే ఆంధ్రా లో మాత్రం ఏ మార్పు లేదు.  ఈరోజు మరో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇండియాలో ఇప్పటివరకు 12000 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: