ఏకంగా 40 రోజుల పాటు మోడీ ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ పొడిగించిన విషయం అందరికీ తెలిసినదే. మార్చి 22 నుండి ఏప్రిల్ 14 వరకు అని అందరూ భావించి … ఎవరికివారు ప్లాన్లు వేసుకున్న టైములో ఏప్రిల్ 14న మే 3 వరకు లాక్ డౌన్ ఉంటుందని చెప్పటం తో ప్రజలంతా ఒక్కసారిగా నిరుత్సాహ పడ్డారు. అసలు ఈ వైరస్ చైనాలో భయంకరంగా ఉన్న టైంలో విమానాశ్రయాలను నిర్బంధించి ఉండకుండా ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలను ఈ విధంగా ముప్పుతిప్పలు పెట్టడం  ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు.

 

ఉద్యోగాలు చేసుకోకుండా, డబ్బులు లేక ఎన్నాళ్ళు ఈ విధంగా ఇంటి లో ఉండి బాధపడాలని చాలామంది ప్రభుత్వం పై మండిపడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తి వేసిన గాని ఆర్థిక వ్యవస్థ నష్టపోవడం వల్ల కచ్చితంగా రేట్లు పెంచటం గ్యారెంటీ అప్పుడు కూడా ప్రజలు నష్టపోతారు కదా అంటూ తీవ్ర స్థాయిలో మోడీ మీద దేశవ్యాప్తంగా ప్రజలు అసహనం చెందుతున్నారు. మీడియా ముందు ఏదో దేశాన్ని ఉద్ధరించినటు పెద్ద పెద్ద ప్రసంగాలు ఇవ్వడం వల్ల.. పరిస్థితులు ఏమీ మారవని… అసలు ఈ వైరస్ వచ్చిన సందర్భంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దేశం ఈ విధంగా నష్టపోదుగా అంటూ మండిపడుతున్నారు.

 

ఒకవైపు దేశంలో ఆకలి కేకలు ఉంటున్న గాని అవి కేంద్ర ప్రభుత్వానికి కనిపించినట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మోడీ మీద యాంటీగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 తర్వాత ఇచ్చిన ప్రసంగానికి స్పందన వస్తుంది. ఇంకా లాక్ డౌన్ కొనసాగించడం ఉంటుందని మళ్లీ మోడీ కనుక ప్రకటన ఇస్తే ఈ సారి ప్రజలు తిరగబడటం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు. ఈ విధమైన స్పందన ప్రజలలో వస్తే రాబోయే రోజులో ప్రభుత్వాలు ఏలా వ్యవహరిస్తేయో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: