కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న వేళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పగా... సామాజిక స్పృహ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విపత్కర సమయంలో ప్రతి పేదవాడికి అండగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు పీలా రామకృష్ణ ప్రతిరోజు విడతలవారీగా 400 మంది కి నిత్యవసర సరుకులు, కూరగాయలను ప్రతి పేదవాడి ఇంటి ముందుకు తీసుకువెళ్లి మరీ అందజేస్తున్నారు.


పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ సమన్వయంతో శ్రీనివాస్ దుంపటి, డాక్టర్ రాజా కలిసి ఖమ్మం జిల్లా లోని జీసస్ వృద్ధాశ్రమానికి నగదు, నిత్యావసర సరుకులు, ఆహార నిల్వలు ఇంకా మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు.


ఇకపోతే అనేక ప్రాంతాలలో లాక్ డౌన్ కారణంగా తిండి లేక నిత్యావసర సరుకుల లేక ఇబ్బంది పడుతున్న పేదవాళ్లకు జనసేన కార్మికులు ఆరు రకాల కూరగాయలను అందజేస్తున్నారు. మురికివాడల్లో తల దాచుకుంటున్న వృద్ధులకు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు బియ్యం కూరగాయలను అందజేస్తున్నారు. అయితే ఈ కూరగాయలు దానం చేసే కార్యక్రమం లో పాల్గొంటున్న ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను ధరిస్తూ లాక్ డౌన్ నిబంధనలను పర్ఫెక్ట్ గా పాటిస్తున్నారు.

 

ఏది ఏమైనా ఆకలి తో అల్లాడుతున్న పేద ప్రజలకు సాయం చేయడం అనేది మెచ్చుకోదగిన గొప్ప పని అని చెప్పుకోవచ్చు. కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు కాకుండా మిగతా పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తమ వంతుగా పేద ప్రజలకు సహకారం చేస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: