కరోనా వైరస్ వల్ల అగ్రరాజ్యం అమెరికా మరియు అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. డబ్బు, టెక్నాలజీ అన్ని రకాలుగా అభివృద్ధి కలిగిన ఒక వైరస్ ని జయించలేక పోతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అయితే అన్ని చోట్ల ఈ విధమైన పరిస్థితి ఉంటే ఒకే ఒక్క జిల్లా కరోనా తన పరిధిలోకి రాకుండా ఎదురు నిలబడింది. ఆ జిల్లా పేరే శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు అని ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు. చాలా మంది ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వలస వెళ్తూ వస్తూ ఉన్నాగాని ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

అయితే ఇక్కడ కారణం చూస్తే కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలోనే జిల్లాలో ఉన్న అధికారులు కలెక్టర్లు మరియు ఎస్పీలు అంతా ఒక్కటై పోరాడటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించగానే జిల్లాలో కఠినంగా అమలు పర్చారు. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో కూడా భౌతిక దూరం పాటించేందుకు తగిన జాగ్రత్తలు ముందు నుంచే అధికారులు తీసుకున్నారు. ఎక్కడికక్కడ రైతు బజార్లను విశాల ప్రాంగణంలో పెట్టి ప్రజలుకు ఇబ్బంది లేకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. కొందరికి నేరుగా నిత్యావసర వస్తువులను ఇళ్లకే సరఫరా చేశారు.

 

లాక్ డౌన్ కు ముందు శ్రీకాకుళం జిల్లాకు పెద్దయెత్తున విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని వెంటనే గుర్తించారు. వెంటనే క్వారంటైన్ కు తరలించారు. వారు నిబంధనలను ఉల్లంఘించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 1445 మంది విదేశాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. వీరందరినీ వెంటనే గుర్తించివారిలో 500 మందిని క్వారంటైన్ కు తరలించడం జరిగింది. అలాగే ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవటంతో శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మొత్తంమీద చూసుకుంటే ఆ జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి వల్లే కరోనా వైరస్ జిల్లాలోకి ప్రవేశించిన లేక పోయినట్లు అర్థమవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: