తనకు భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ కు  గతం లో  ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం  మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ ఆయన రాసింది కాదని  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి  ఆరోపించారు  . కేంద్ర హోంశాఖ కు , ఆ లేఖ  తెలుగుదేశం పార్టీ నాయకులు  రాశారని అన్నారు .  కేంద్ర హోంశాఖ కు  రమేష్ కుమార్ రాసినట్లుగా చెబుతున్న  లేఖ లో ఆయన సంతకం ఫోర్జరీ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు  . ఈ మేరకు  ఆ లేఖపై విచారణ జరిపించాలని కోరుతూ  ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు  విజయసాయి రెడ్డి   లేఖ రాశారు .

 

అయితే విజయసాయి ఆరోపణలను ఖండిస్తూ , కేంద్ర హోంశాఖ కు  ఆ లేఖ తానే రాసినట్లుగా రమేష్ కుమార్ స్పష్టం చేశారు . దీనితో ఒక్కసారిగా విజయసాయి రెడ్డి , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆత్మరక్షణ లో పడినట్లయింది . అయితే ఆ లేఖలో సంతకం చేసింది ఎవరో  , ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోంశాఖ కు మెయిల్ చేశారో చెప్పాలంటూ విజయసాయి డిమాండ్ చేయడం ద్వారా , రమేష్ కుమార్ ను ఆత్మరక్షణ లోకి నెట్టాలన్నదే విజయసాయి  ఎత్తుగడ గా  కన్పిస్తోంది .  కేంద్ర హోంశాఖకు రమేష్ కుమార్ గతం లో లేఖ రాసినట్లుగా,   కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ధృవీకరించారు . రమేష్ కుమార్ కు భద్రత పెంచుతామని కూడా  ఆయన  ప్రకటించారు .

 

ఇప్పుడు ఆ  లేఖ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి టీడీపీ ని , మాజీ ఎన్నికల కమిషనర్ ను ఆత్మరక్షణలోకి నెట్టాలని భావించిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం , ప్రత్యేకించి విజయ సాయి ఆత్మరక్షణ లో పడిపోయారు . ఇప్పటికే రమేష్ కుమార్లేఖ తానే రాశానని పేర్కొనగా , రమేష్ కుమార్ తమకు లేఖ రాశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చెప్పిన మాటల్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ నాయకత్వం తో కోరి విజయసాయి శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్లయిందన్న వాదనలు విన్పిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: