భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ అసామాన్య రీతిలో పెరిగిపోతూ ఉంది. కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలు దానికి అడ్డుకట్ట వేయడంలో సఫలం అవుతూ ఉంటేదిల్లీ, మహారాష్ట్రా, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మాత్రం గత 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదు చేసుకున్నాయి. ఆంధ్ర, తెలంగాణ మరియు తమిళనాడు మాత్రం కొంచెం స్థిరంగా ఉన్నాయి.

 

వెయ్యికి పైగా తాజా కేసులతో, భారతదేశం కోవిడ్ -19 కేసుల సంఖ్య ఇప్పుడు 11,439 కు చేరుకుంది. వీటిలో 9,756 క్రియాశీల కేసులు ఉండగా, 1,306 మంది రోగులు నయం చేయబడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో కేవలం డెబ్భై ఆరు మంది విదేశీ పౌరులు ఉన్నారు.

 

ఇక రాష్ట్రాల వారీగా వస్తే.. మహారాష్ట్ర నుంచి 2,684, ఢిల్లీ 1,561, తమిళనాడు 1,204 , రాజస్థాన్‌లో 1,046, మధ్యప్రదేశ్‌లో 741, ఉత్తరప్రదేశ్‌లో 695 వరకు నమోదయ్యాయి. గుజరాత్‌లో 695 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 660 , కేరళ 386 కేసులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో 278, కర్ణాటకలో 277, హర్యానాలో 198, పశ్చిమ బెంగాల్‌లో 213 కు పెరిగింది. పంజాబ్‌లో ఇప్పటివరకు 184 ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. బీహార్‌లో 70 కేసులు, ఒడిశాలో 60 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

 

ఆంధ్రప్రదేశ్ 525 కేసులు శుక్రువారం నాటికి నమోదు కాగా వాటిలో 23 కేసులు ఒక్క రోజులో బయటపడ్డాయి, తెలంగాణలో 644 కేసులలో ఒక్క రోజు కేవలం ఆరు కేసులే నమోదయ్యాయి. ఇక కేరళలో అనూహ్యంగా ఒక్క కొత్త కేసు కూడా రోజు నమోదు కాకపోగా.. ఆరుగురు డిశ్చార్జి కావడం గమనార్హం.

 

ఇక కేసుల పెరుగుదలను చూస్తుంటే.. లాక్ డౌన్ మే 3 తేదీన కూడా ఎత్తేయడం అనుమానమే. నెల 20 నుండు లాక్ డౌన్ నిబంధనల్లో కేంద్రం సడలింపులు చేసి తప్పు చేసిందా అన్న సందేహాలు కూడా నెంబర్లు చూసి ప్రజల్లో తలెత్తుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: