ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్  విషయంలో ప్రజలు నిత్యావసరాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు.అయితే  మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మందుబాబుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. రోజు ఒక పెగ్గు వేసి హాయిగా నిద్ర పోయే మందుబాబులకు ప్రస్తుతం చుక్క మందు కూడా దొరక్కపోవడంతో పిచ్చివాళ్ళలా మారిపోతున్నారు. చుక్క మందు కూడా గొంతులోకి వెళ్లకపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు. దీంతో మందు బాబుల మందు కేకలు వినిపిస్తున్నాయి. ఇక దీన్ని ఆసరాగా చేసుకుంటున్నారు చాలామంది. ఎలాగో మందుబాబులు మందు కోసం నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు. ఇక లాక్ డౌన్  సమయంలో ఎక్కడ మందు దొరికే అవకాశం కూడా లేదు. ఈ నేపథ్యంలో మందుబాబులకు మద్యం ఎంతో అవసరంగా మారిపోయింది. 

 

 

 ఈ అవసరమే చాలామందికి ఆసరాగా మారిపోయింది. మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. వైన్  షాప్ యజమానులతో ఏదో విధంగా ఒప్పందం చేసుకుని... మద్యం బాటిళ్లను తెచ్చుకొని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఏకంగా గతంలో 700 రూపాయలు ఉన్న మద్యం బాటిల్ ప్రస్తుతం నాలుగు వేల రూపాయలకు అమ్ముతున్నారు. అయినప్పటికీ మద్యానికి గిరాకీ మాత్రం తగ్గడం లేదు. ఈ వ్యాపారం మొత్తం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ఇక మందు ఎవరు అమ్ముతున్నారు అన్నది కూడా కేవలం మందుబాబులకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ఒక మెడికల్ షాపు యజమాని కూడా మందుబాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకుందాం అనుకున్నాడు. కాని చివరకు కటకటాల వెనక్కు పంపారు పోలీసులు. 

 

 

 మహారాష్ట్రలోని నాగపూర్ లో  ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపద్యంలో బార్లు వైన్ షాపులు మొత్తం బంద్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగపూర్ గణేష్ పేట్  ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని నిశాంత్ అలియాస్ బంటి  తన షాపులోనే బీరు అమ్మకాలు ప్రారంభం చేశాడు. మంచి నీళ్ల బాటిల్స్ లో బీరు  నింపి అమ్మకాలు ప్రారంభించాడు. ఇక గుట్టుచప్పుడు కాకుండా కేవలం మందుబాబులకు మాత్రమే తెలిసేలా ఈ వ్యాపారం కొనసాగించాడు. కానీ ఈ నోటా ఈ నోటా పడి చివరికి పోలీసుల వరకూ వెళ్లింది ఈ విషయం. దీంతో పోలీసులు సడన్గా ఆ మెడికల్ షాప్ పై  రైడ్ చేయగా లీటర్ల కొద్దీ బీరు లభించింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో తప్పించుకున్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: