సమాజంలో మానవత్వం అనేది నశిస్తుంది.. మోసం చేయడం, మోసపోవడం అనేవి జీవిత చర్యల్లో ఒక భాగంగా మనిషి అలవరచుకుంటున్నాడు.. రోజు రోజుకు నాది.. నేను అనే స్వార్ధం లోలోపల పెంచిపోషించుకుంటున్నాడు.. సాటి మనిషికి సహాయం చేయాలనే గుణాన్ని విడిచిపెట్టి జలగలా పీడించుకు తినే రోజులను మనం చూస్తున్నాం.. ఇక సహాయం చేసే వారు చాలా తక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఎవరైనా జాలి తలచి సహాయం చేస్తే.. అంది పొందిన వ్యక్తి అంతే నిజాయితీగా ఉండటం మానేసి సహాయం చేసిన వ్యక్తికే సున్నం పెడుతున్నాడు.. అంటే లోకంలో నిజాయితీ అనేది బ్యాలన్స్‌గా లేదు.. కాబట్టి.. మనిషి మీద మనిషికి నమ్మకం అనేది కలగడం లేదు.. ఎందుకంటే అరాచకాలు చాలా ఎక్కువై పోయాయి..

 

 

ఇకపోతే వడ్డీలకు డబ్బులు ఇవ్వడం నేరం.. ఇది చట్టబద్దమైనది కాదు.. సరే ఏం అవసరం పడి తీసుకున్నాడో తెలియదు గానీ ఒక వ్యక్తి అప్పుగా ఓ వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు.. అయితే ఆ డబ్బులు సకాలంలో చెల్లించలేదని అతని భార్యను ఎత్తుకెళ్లాడు ఆ వడ్దీ వ్యాపారి.. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలు చూస్తే.. సులానగర్‌కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బానోత్‌ హన్మా అనే వడ్డీ వ్యాపారి దగ్గర గతంలో రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. కాగా వీటిలో రూ.1.50 లక్షలు ఇటీవలే చెల్లించాడు.. అయితే ఈ లోపల కరోనా రావడం దేశమంతా లాక్‌డౌన్‌ విధించిన కారణంగా పనులు లేక అజ్మీరా హట్యా మిగిలిన డబ్బులు చెల్లించలేక పోయాడు..

 

 

ఇందుకు కాస్త గడువు కావాలని వడ్డీ వ్యాపారిని కోరాడు. దీనికి ఒప్పుకోని ఆ వడ్దీ వ్యాపారి బానోత్‌ హన్మా తన అప్పు మొత్తం తీర్చేయాలంటూ, అజ్మీరా హట్యా పై ఒత్తిడి తీసుకొచ్చాడు.. ఈ క్రమంలోనే బుధవారం హన్మా కోపంతో హట్యా ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేయడమే కాకుండా, అడ్డుపడిన హట్యా భార్యను తన ఇంటికి లాక్కెళ్లి నిర్బంధించాడు. దిక్కుతోచని స్దితిలో ఉన్న అజ్మీరా హట్యా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా బాధితుడి ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు హన్మాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: