సోషల్ మీడియా వచ్చేశాక ఇప్పుడు ఏ వార్త అయినా సరే క్షణాల మీద ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్.. ఇన్‌స్టాగ్రామ్.. ఇలా అనేక వేదికలపై సమాచారం రాకెట్ వేగంతో స్ప్రెడ్ అవుతోంది. అయితే మొదట వచ్చిన సమాచారం తప్పయినా సరే.. ఆ విషయం గమనించేలోగానే అది కోట్ల మందికి చేరిపోతోంది. అలా అనేక తప్పుడు విషయాలు జనంలోకి వెళ్తున్నాయి.

 

 

కొందరు తెలియక ఇలా సమాచారం వ్యాప్తి చేస్తుంటే.. మరికొందరికి ఇది ఓ శాడిస్టిక్ అలవాటుగా మారింది. ఇక కరోనా వంటి కష్టకాలంలో ఇలాంటి పుకార్లు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ఇలాంటి పుకార్లపై సమాచారం ఇస్తోంది. ఏది సత్యం- ఏది అసత్యం అనే విషయంపై క్లారిటీ ఇస్తూ సమాచారం పొందుపరిచింది.

 

 

అందులో కొన్ని చూద్దాం.. 4g, 5g తరంగాల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఇటీవల కొందరు ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. అలాగే.. ఉష్టదేశాల్లో కరోనా వ్యాపించదని చెబుతున్నారు. అదీ తప్పే. అనేక ఉష్టదేశాల్లో కరోనా తన ప్రతాపం చూపుతోంది. కరోనా వృద్ధులకే తప్ప కుర్రాళ్లకు రాదని ప్రచారం చేస్తున్నారు.. ఇదీ తప్పే.. అనేక మంది యువకులు కూడా కరోనా బారిన పడి ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు.

 

 

ఆల్కహాల్ తాగితే కరోనా చచ్చిపోతుందనే అపోహ కూడా ఉంది. ఇది కూడా నిజం కాదు. అంత సింపుల్ పరిష్కారం ఉంటే.. లక్ష మందికి పైగా కరోనాతో ఎందుకు చనిపోతారు. పది సెకన్లపాటు ఊపిరి బిగపడితే మీకు ఎలాంటి సమస్య లేకపోతే.. మీకు కరోనా లేనట్టే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అది కూడా వాస్తవం కాదు. కరోనా లక్షణాలు వెంటనే బయటపడవు. ఒక్కసారి కరోనా వచ్చి దాని నుంచి కోలుకుంటే మళ్లీ కరోనా రాదనే ప్రచారం కూడా కరెక్టు కాదు. అలాగే కరోనా వ్యాధి దోమల ద్వారా వ్యాపించదు. ఇది కరోనా వచ్చిన వారి నోటి తుంపర్లు, ఉమ్మి, చీమిడి వంటి వాటి ద్వారానే వ్యాపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: