మూడు దశాబ్దాలుగా భారత చదరంగంలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయాడు విశ్వనాథ్ ఆనంద్. అభిమానుల ఆశీస్సులు, తల్లిదండ్రులు, సతీమణి ప్రోత్సాహంతోనే తాను విశ్వ విజేతగా నిలిచినట్టు చెబుతుంటారు.  ప్రస్తుతం కరోనా విశ్వవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా మహమ్మారి భారిన పడి విల విలలాడుతున్నారు.  చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఈ కరోనా వైరస్ సోకి మరణిస్తున్నారు.  

 

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చెస్ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లి జర్మనీలో బాడ్ సోడెన్ అనే చిన్న పట్టణంలో విశ్వనాథ్ ఆనంద్ చిక్కుకు పోయారు.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ గడ్డు కాలం నడుస్తుంది.  తాజాగా ఈ విషయం పై విశ్వనాథ్ ఆనంద్ స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తుంది.

 

ఈ ప్రభావం ఇలాగే ఉంటే ఇప్పుడే స్వస్థలం చెన్నైకి వచ్చే పరిస్థితులు లేవు. కొంత కాలం నేను ఇక్కడే ఉండాల్సిందే.. జర్మనీలో ఇప్పుడే లాక్ డౌన్ ఎత్తివేయకపోవొచ్చు.. నేను ఎక్కడికి వెళ్లినా స్వియ నిర్భందంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: