దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి గురించి కర్ణాటకకు చెందిన బాల జ్యోతిష్యుడు అభిగ్య అనంద్ ఏడు నెలల క్రితమే చెప్పాడు. బాలుడు చెప్పిన జోస్యం నిజం కావడంతో బాలుని మాటలను ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఈ బాల మేధావి గ్రహ స్థితులను అనుసరించి దేశానికి రాబోయే ప్రమాదాల గురించి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. 
 
ఏడు నెలల క్రితం ఈ బాల మేధావి 2019 నవంబర్ నుంచి 2020 మే వరకు ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని వీడియో కూడా చేశాడు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర భయానక పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించాడు. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని వ్యాఖ్యలు చేశాడు. గతేడాది బాల మేధావి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
అయితే అభిగ్య చేసిన మరో పోస్ట్ లో మే 31వ తేదీకి రెండు రోజుల ముందు కరోనా అదుపులోకి వస్తుందని అన్నాడు. జూన్ 30వ తేదీ వరకు ప్రపంచం ఎలాంటి శుభవార్త వినదని ప్రపంచవ్యాప్తంగా అప్పటివరకు కరోనా ముప్పు ఉంటుందని వ్యాఖ్యలు చేశాడు. కరోనా వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారని చెప్పాడు. మే 4వ తేదీ వరకు ప్రజలు తీవ్ర ఆహార లేమిని ఎదుర్కొంటారని చెప్పాడు. 
 
ఈ సంవత్సరం డిసెంబర్ లో ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటే మాత్రమే ముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని అభిగ్య చెప్పాడు. మైసూర్‌కు చెందిన అభిగ్య ఆనంద్ 14 ఏళ్లకే గుజరాత్‌లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేదవిశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఇంత నియమితులయ్యాడు. . ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభిగ్య ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: