కరోనా వైరస్ చైనాలో పుట్టిందన్నది జగమెరిగిన సత్యం. దీన్ని చైనా కూడా కాదనడం లేదు. అయితే చైనా నిర్వాకాల వల్లే, కుట్రల వల్లే కరోనా వైరస్ చైనా నుంచి ప్రపంచానికి వచ్చిందన్న విమర్శలు కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా కరోనా ను చైనీస్ వైరస్ అంటూ తరచూ అంటున్నారు. చైనా తప్పుల వల్లే కరోనా ప్రపంచానికి పాకిందంటున్నాడు. అయితే దీనికి ఆధారాలేవీ అంటోంది చైనా.

 

 

ఇప్పుడు చైనాకు షాక్ ఇచ్చేలా ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్..ఏపీ తాజాగా కొన్ని అదిరిపోయే కథనాలను వెలువరించింది. అసలు వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టిన తొలి రోజుల్లో అక్కడేం జరిగింది..? స్థానిక వైద్యులు ఏం రిపోర్ట్ చేశారు..? వాటిని చైనా ఎలా తొక్కిపట్టింది..? జిన్‌పింగ్ వాటిపై ఏ నిర్ణయం తీసుకున్నాడు..? లాంటి అన్ని విషయాలనూ రికార్డులతో సహా బయటపెట్టి చైనాకు షాక్ ఇచ్చింది.

 

 

అసోసియేటెడ్ ప్రెస్.. ap కథనాల ప్రకారం చైనా వైరస్ ప్రస్థానం ఇలా సాగింది. తేదీల వారీగా చూస్తే..

 

 

December 01: వుహాన్ సిటీలోని ఓ సీఫుడ్ మార్కెట్‌లో మొదట పుట్టిన ఈ కరోనా వైరస్ ను గుర్తించారు. దీనివల్ల మరణించిన ఇద్దరి శాంపిళ్లను పరీక్షించి ఇది కొత్త వైరస్ అని నిర్ధారణకు వచ్చారు.

 

 

January 14: జననవరి 14 నాటికి వైరస్ లక్షణాల్ని కూడా గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమని .. చాలా వేగంగా వ్యాపిస్తుందని కుడా చెప్పారు. అయితే.. చైనా అధ్యక్షుడు మాత్రం దీని గురించి ప్రపంచానికి చెప్పలేదు.

 

 

January 20: అతి తక్కువ కాలంలోనే వుహాన్‌లో వైరస్ బాధితుల సంఖ్య 3 వేలకు పెరిగింది. అయినా చైనా దీనిగురించి పెద్దగా పట్టించుకోలేదు.

 

 

February 12: చైనా కొత్త సంవత్సరం.. ఈ వేడుకకు చైనీయులు చాలా పెద్ద సంఖ్యలో సంబరాలు చేసుకుంటారు. విదేశాలకూ వెళ్తారు. అయినా సరే చైనా పెద్దగా పట్టించుకోలేదు. విదేశీయానాలపై ఆంక్షలు పెట్టలేదు. దీంతో వైరస్ చైనా ను దాటి ప్రపంచంలో అడుగు పెట్టింది. ఇలా కరోనా వ్యాప్తి చెందితే.. జనవరి 17 దాకా తమ దేశంలో అసలు కేసులే నమోదు కాలేదంటూ చైనా బుకాయించింది. ఇప్పుడు ఈ కథనాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: