దేశంలో కరోరా కష్టాలు ఎంతగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రోజూ మరణాలు.. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఈ కరోనాని అడ్డుకునేందుకు మందులు ఏవీ ఇంకా రాలేదు.. కేవలం మనం జాగ్రత్తలు తీసుకోవడం తప్ప. తెలంగాణలో కరోనాని కట్టుదిట్టం చేయడానికి సీఎం ఎప్పటికేప్పుడు అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా జనం నానా బాధలూ పడుతున్నారు.

 

నిత్యావసరాలు సరిగ్గా అదండం లేదు. కేవలం బియ్యం, కందిపప్పుతోనే పూట గడవదు కదా. కారం, సబ్బులు, శాంపులు నానా సరుకులూ కావాలి. లాక్ డౌన్ కారణంగా కిరాణాషాపులను కొన్ని గంటలే తెరుస్తున్నారు.  మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లో పరిస్థితి చెప్పడానికి లేదు.  ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఓ గిరిజన తండాలో కదిలే కిరాణా షాపును నడుపుతోంది. ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాలో ఒక కరోనా పాజిటివ్ కేసు ఉండడంతో అక్కడి ప్రజలు బయటికి వెళ్ళకుండా ఆర్టీసీ బస్సునే కిరాణా షాపుగా మార్చారు.

 

రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. మరికొంత కాలం దేశంలో కరోనా కష్టాలు తప్పవని.. అందుకే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ఈ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తండా ప్రజలు బయటికి వెళ్లకూడదని, కరోనా సోకకుండా మాస్కులు పెట్టుకుని, చేతులను కడుక్కుంటూ ఉండాలని కోరారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: