ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన తెలుగు తమ్ములు అంతా ఒకే ఒక్క ఫోన్ కాల్ పైనే తమ ఆశలు పెట్టుకున్నారు. ఒక్క ఫోన్ కాల్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ విషయానికి సంబంధించి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్య ఫోన్ సంభాషణ సాగిన విషయం తెలిసిందే. మోడీతో చంద్రబాబు విడిపోయి చాలా కాలం అయింది. రాజకీయపరంగా తన స్వలబ్దికోసం బిజెపి పార్టీ పై విపరీతమైన విమర్శలు చేసిన చంద్రబాబు తర్వాత దానికి తగ్గ మూల్యం కూడా చెల్లించుకున్నాడు.

 

ఇకపోతే వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి అన్న విషయం ఎవరికీ ఇప్పటివరకు పూర్తిగా తెలియనప్పటికీ ఇది మాత్రం టిడిపి శ్రేణుల్లో కొత్త ఆశలను చిగురిస్తోంది. ఇకపోతే ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా జగన్ కు మోడీ పరోక్షంగా సహకరించారు అన్నది బహిరంగ సత్యం. తర్వాత జగన్ బీజేపీ హైకమాండ్ ను కలిసేందుకు పలుమార్లు ఢిల్లీకి వెళ్ళినా అతనికి ఆశించిన స్థాయిలో అటువైపు నుండి రియాక్షన్ లేకపోవడం మరియు చాలా రోజుల తర్వాత చంద్రబాబు మరియు మోడీ మొదటిసారి మాట్లాడుకోవడంతో రెండు అగ్ర నేతలు తిరిగి చేతులు కలుపుతున్నారు అన్న ఊహాగానాలు ఇప్పటికే బయలుదేరాయి.

 

పరిస్థితి ఇక్కడ ఇలా ఉంటే.. తాజాగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న బిజెపి.. తెలుగుదేశం పార్టీని కూడా చివరికి కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తే పవన్ కి ఎక్కి తొక్కడానికి వైసీపీ శ్రేణులు ఎప్పుడూ ముందుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదట టీడీపీకి మద్దతు ఇచ్చి తర్వాత వారి పై తీవ్రమైన విమర్శలు చేసిన పవన్ ఎట్టి పరిస్థితుల్లో తెదేపాలో కలిపేది లేదని చాలా సార్లు తేల్చి చెప్పినా.... ఇప్పుడు బీజేపీతో పొత్తుకి టిడిపి కూడా వచ్చి వీరితో కలిస్తే అతను తప్పక బిజెపి నుండి విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కనుక జరిగితే జనసేన పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుంది అన్నది మాత్రం అక్షర సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: