కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణ లోని చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాయి. ఒకదశలో తమ గ్రామాలకు కొత్తవారిని ఎవరినీ రానివ్వకుండా పహారా కాస్తున్నాయి.  అంతే కాదు తమ గ్రామంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు వెంటనే సమాచారాన్ని అందిస్తున్నారు.  ఈ విషయంలో తెలంగాణలో   సర్పంచ్ లు ముందుండి కరోనా కట్టడి చర్యల్లో పాలుపంచు కుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ మండలంలోని గోసాయిపల్లిలో కూడా కరోనా కట్టడి చర్యలను తిరుగులేని విధంగా అమలు చేస్తున్నారు.

 

ఇటీవల సాయి గౌడ్ తల్లి తులశమ్మ బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే తిరిగి గ్రామంలో ప్రవేశిస్తుండగా, సర్పంచ్ సాయిగౌడ్ అడ్డుకున్నాడు. తల్లి అయినా సరే నిబంధనలు పాటించాల్సిందేనని, లాక్ డౌన్ సమయంలో బయటి నుంచి గ్రామంలోకి ఎవరినీ అనుమతించేది లేదని కరాఖండీగా చెప్పేశాడు. దాంతో చేసేది ఏమీ లేక ఆమె తిరిగి వారి చుట్టాల ఇంటికే వెళ్లిపోయింది.  తెలంగాణలోనే ఓ యువ మహిళా సర్పంచ్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

ఏకంగా గ్రామ శివారులో ఆమె చేతి కర్ర పుచ్చుకొని కాపలా కాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మదనాపురం గ్రామానికి చెందిన ఉడుతా అఖిలా యాదవ్  గ్రామ ప్రవేశ ప్రాంతం వద్ద కర్రతో నిలుచుని లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.  మరికొన్ని చోట్ల రక రకాల పద్దతుల్లో సర్పంచ్ లు లాక్ డౌన్ ని సీరియస్ గా అమలు పరుస్తున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: