దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తూ ఉండటంతో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటే... మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నాయి కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని సాఫ్ట్ వేర్ కంపెనీలు చెబుతున్నాయి. 
 
ఒక్కో కంపెనీ ఉద్యోగుల విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తోంది. అయితే ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ మాత్రం ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని క్యాప్ జెమినీ కంపెనీలో పని చేస్తున్న 84,000 మంది (దాదాపు 70 శాతo) సిబ్బందికి ఏప్రిల్ నెల నుంచి వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఉద్యోగులకు జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నామని ప్రకటన చేసింది. 
 
బెంచ్ మీద ఉన్న ఉద్యోగులకు కూడా కంపెనీ శుభవార్త చెప్పింది. వారిని నిలుపుకోవడం కోసం వారికి కూడా జీతాలు ఇస్తామని కీలక ప్రకటన చేసింది. క్యాప్ జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ బెంచ్ టైమ్ తో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని పేర్కొన్నారు లాక్ డౌన్ వల్ల క్యాప్ జెమినీ కంపెనీ ఉద్యోగులు ఇంటి నుండి విధులు నిర్వహిస్తున్నారు. 
 
కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు షిప్ట్ అలవెన్సును ఇవ్వనున్నట్టు ప్రకటన చేసింది. సీఈవో అశిన్ సాధారణంగా ఉద్యోగులకు ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ప్రమోషన్లు ఇస్తామని అయితే లాక్ డౌన్ వల్ల నులై 1వ తేదీ నుంచి ప్రమోషన్లు ఇవ్వనున్నామని కీలక ప్రకటన చేశారు. క్యాప్ జెమినీ కంపెనీ లాక్ డౌన్ సమయంలో ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర కంపెనీల ఉద్యోగులు కూడా ఇదే విధంగా తమ కంపెనీలు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: